అభి కాల్ చేసి అఫీస్ పక్కనున్న రెస్టారెంట్ లో వెయిట్ చేస్తుంటాను రమ్మని కాల్ కట్ చేయడం తో దీన్ని ఇక్కడే క్యాంటీన్లో వెయిట్ చేయమంటే బయటకి ఎందుకు వెళ్ళింది అని అభి ను తిట్టుకుంటూ హెచ్. ఆర్ ను బ్రతిమలాడి గంట పర్మిషన్ తీస్కొని అభి చెప్పిన రెస్టారెంట్ లోకి వెళ్లి చాక్లెట్ ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తూ తింటున్న అభి తల మీద ఒక్కటి పీకి నిన్ను లోపల వెయిట్ చేయమంటే బయటకి ఎందుకు వచ్చావే నీ వల్ల మా హెచ్. ఆర్ తో బండ బూతులు తిట్టించుకుని మరీ వచ్చాను అంటూ అభి చేతిలోని ఐస్ క్రీమ్ లాక్కుని తింటూ చెప్తుంది
ఒసేయ్ కకృతి మోహమా కావాలంటే ఇంకోటి ఆర్డర్ చేసుకో నేను తినేది లాక్కుని తింటావేంటి అంటూ వెయిటర్ ను పిలిచి తన కోసం మరోటి ఆర్డర్ చేస్తుంది