ఎక్కువ లాగకు ఉపయోగం లేదు అని అతను అంటే ఏడ్చేస్తూ ప్లీజ్ నన్ను మా నాన్న దగ్గరికి తీసుకెళ్లవా అమ్మ అక్క ఎలా ఉన్నారో అని తగ్గుతూ అతడి ముందు చేతులు జోడించి మోకాళ్ళ మీద కూర్చుండిపోయింది ఆకృతి.
ఫోన్ ని రెండు వేళ్ళ మధ్య పట్టుకొని అటు ఇటు తిప్పుతూ మరి నా ఆమ్లెట్ అని అతను అడుగుతుంటే వేళ్ళకు చర్మం చీలి రక్తం వస్తున్నా కూడా దాన్ని టాప్ కింద వాష్ చేసేసి ఆమ్లెట్ వేసిస్తే హాస్పిటల్ కి అయినా తీసుకువెళ్తాడేమో అనుకుంటూ పెనం పెట్టి గుడ్లు వెతికి ఫాస్ట్ ఫాస్ట్ గా రెండు ఆమ్లెట్లు వేసుకోవచ్చి అతడికి ఇచ్చింది ఆమె.