New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

కలియుగ మ(మా)యసభ

113 stories Ongoing Inspirational Crime Family Drama

పచ్చటి పందిరి... చిన్నపిల్లలతో కోలాహాలతో, పెద్దవాళ్ళ పెద్దరికలతో, ఆడపడుచుల గాజుల్ల సవ్వళ్ళతో, మగవాళ్ళ ఉరుకుల పరుగులతో, పాకశాలలో గుమగుమలతో, బంధువుల ఆర్భాటాలతో కలకలలాడుతూ ఉంది.ఒక పెద్దావిడ మధ్య వయసుగల మహిళతో.. "అమ్మాయిని తీసుకురండి మళ్ళీ వర్జ్యం వస్తుంది." అని తొందరపెట్టింది."శైలు చెల్లిని అంట తీసుకురమ్మ.." అని అంది ఆ మధ్య వయసుగల మహిళ నిండైన కట్టు బొట్టుతో ఉన్న వివాహిత వైపు చూస్తూ."సరే పిన్ని." అని చిరునవ్వుతో కూర్చున్న కుర్చీలో నుంచి పైకి లేచింది హుషారుగా ఆ వివాహిత అయినటువంటి శైలు."ఏ అమ్మాయి నువ్వు ఆగు..' అని శైలు వైపు చూసింది కోపంగా,ఆ మధ్య వయసు గల స్త్రీని ఉరిమి చూస్తున్నట్టుగా చూసి..'ఎవరికి ఏం పని చెప్పాలో కూడా తెలియదు నీకు, ఇంత…

Browse Stories

కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 41

              “ఇంటికి ఎవరు వచ్చిన నీళ్లు,టీ ఇవ్వడం అనేది మాకు అలవాటు అమ్మ. భోజనాల సమయానికి వస్తే భోజనం పెట్టే పంపిస్తాం, ఇందులో శ్రమ అంటూ ఏమీ ఉండదు.” అని అంది ముఖం మీద చెరగని నవ్వుతో కౌసల్య.         “థాంక్యూ ఆంటీ.” అని అంది నీళ్లు తాగి గ్లాస్ పక్కన పెడుతూ వేద.     “థాంక్యూ గట్రా వద్దులే టీ తాగి […]

3 min 10 views
కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 42

కౌసల్య ముఖం చూస్తూ..”అదే చుట్టాలు ఉన్న ఒక్క కొడుకుని,ఆ కొడుకు భార్యని బాగా చూసుకోలేదు అని మన వియ్యంకురాలిని ఏమీ అనుకోరా..? ఉట్టి కోడలిని మాత్రమే అంటారా..!   ” కొడుకు వయసు కంటే చిన్నమ్మాయి అత్తమామల్ని అమ్మ నాన్నలుగా చూసుకోవాలి,కానీ..! కొడుకు కంటే చిన్నది అయినా కోడల్ని కూతురుగా చూసుకోలేరు అత్తమామలు.ఇది ఎక్కడి వింత పోకడనే.      “చుట్టాలు అనుకుంటారు, ఇరుగుపొరుగు వాళ్ళు అనుకుంటారు అని బతకడానికి మన జీవితం సమాజం కోసం అంకితమా..? […]

3 min 8 views
కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 43

“నా తిండి నేనే తింటున్నాను,నా ఊపిరి నేనే పీల్చుకుంటున్నాను మరి నా ఆశయాలు మాత్రం ఇంకో జనరేషన్ కి ఎలా ఇవ్వాలి అనుకుంటాను.నా పిల్లలకి కూడా ఒక ఆశయం ఉంటుంది కదా..!    “మా నాన్న వరకు నేను కరెక్ట్. ఎందుకంటే..! మా అమ్మ ఎలా చనిపోయిందో నాకు తెలిసి అదే నా ఆశయమైంది,ఇంకో తల్లి నా తల్లిలా అవకూడదు అని.   ” నా బిడ్డ వరకు వచ్చేసరికి తనకు కూడా స్వేచ్ఛ,స్వాతంత్రం ఇవ్వాలి అనిపించింది. […]

3 min 9 views
కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 44

నాలుగో భాగం వాళ్ళని చూస్తూ..”వాడి సెటప్..అదే ఆయన పి ఏ ఇంటి చుట్టుపక్కల ఇద్దరు ఉండండి,మిగిలిన ఇద్దరూ ఆమె ఇంట్లో పనివాళ్ళుగా కుదరండి, మిగిలిన ఒక్కరు ఆమె డ్రైవర్ గా ఉండండి.” అని అన్నాడు శౌర్య.     “ఓకే సార్..” అని అన్నారు నాలుగో భాగం వాళ్లు.       “ఎవరి లోసుగులు అయినా పని వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి మీరు ప్రతి క్షణం అలర్ట్ గా ఉండండి,ఒక వ్యక్తి భార్య దగ్గరైనా దాస్తాడేమో […]

3 min 8 views
కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 45

“నా కూతురు సంసారం గురించి నాకు పట్టింపు లేకపోతే ఎవరికి ఉంటుందిరా…!    “అన్ని అనుభవించిన నాకు తెలుస్తుంది కదా..! తన భవిష్యత్తు ఏంటి..? ఎవరు ఏమంటారు..! అని, అలాంటప్పుడు అది మంచిది కాదు ఇది చెయ్యి అనడంలో తప్పేముంది.” అని అంది కూతురైన సరే తన సంసారంలో కలగజేసుకోవద్దు అన్న కొడుకు మాటలకి నొచ్చుకున్న కౌసల్య.       “అవునా..! సరే నువ్వు పెద్ద దానివి అన్నీ అనుభవించావు,నీకు అన్నీ తెలుస్తాయి కదా..?   […]

3 min 11 views
కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 46

అప్పటివరకు తమ బెడ్ రూమ్ దగ్గర నిలబడ్డ రఘు రామయ్య గారు కౌసల్య చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని..”తనని డిస్టర్బ్ చేయకు,శైలు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడే మాట్లాడు..ఇవి అన్ని నీకు తెలుసు అని చెప్పకు మళ్ళీ అప్పుడు జరిగినవి అన్ని గుర్తు తెచ్చుకొని బాధపడుతుంది.” అని అన్నాడు.     “మీకు ఇవన్నీ ముందే తెలుసా..!” అని అంది కన్నీళ్ళతో భర్తని చూస్తూ కౌసల్య.       “శౌర్య చెప్పాడు,నిన్న.” అని అన్నాడు రఘురామయ్య. […]

3 min 9 views
కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 47

“మీ గేటు పక్కన గోల్డ్ కలర్ లో శాంతినివాసం అనే నేమ్ ప్లేట్ ఉంది కదా.. అది చాలా బాగుంది,కానీ..! ఆ పేరు ఎందుకు పెట్టారు..?   “అంటే..! మీ పేరు కౌసల్య,మీ అమ్మాయి పేరు శైలు అంట,నాకు అను చెప్పింది. కానీ..! శాంతి ఎవరు..?” అని అడిగింది వేద.       “అది చాలా పెద్ద కదమ్మా.” అని అంది కౌసల్య.    “నాకు కథలు అంటే చాలా ఇంట్రెస్ట్ ఆంటీ, ఈరోజు అమ్మనే […]

3 min 7 views
కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 48

“చిన్న అత్తయ్య మాటలకి బాధపడుతూనే.. శాంతి నా అశ్రద్ధ వల్లనే ఇలా అయిపోయింది,ఇప్పుడు పోయిన ప్రాణాన్ని ఎలాగో తీసుకురాలేను..తల్లి కడుపుకోతని ఎలాగో నేను తీర్చలేను కనీసం ఉపశమనమైన ఇవ్వాలి అని అనుకొని,మా మరిది సాంబశివరావుని మా చిన్న అత్తయ్య చేతికి ఇచ్చి..’పోయిన బిడ్డని నేను తేలేను,కానీ..! ఆ బిడ్డ స్థానంలో నా బిడ్డను ఇస్తున్నాను పెంచుకో.’ అని అందంట బాధగా మరిది గారిని చూసి ఏడుస్తూ అత్తయ్య.           “ఎందుకు…? నీ […]

3 min 12 views
కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 49

“ఏంటోనే మీ పెద్దవాళ్ల పట్టింపులు పంతాలు, ఆఖరికి మా మీద కూడా చూపిస్తూ ఉంటారు.” అని అంది నీటూర్పుగా లహరి.       “తల్లిదండ్రుల ఆస్తులు ఎలా పంచుకుంటామో వాళ్ళు చేసిన పాపపుణ్యాలు కూడా అలాగే పంచుకోవాలి, ఆఖరికి పంతాలు పట్టింపులు కూడా.” అని నవ్వింది పక్కన కూర్చున్న వేద లహరిని చూస్తూ.       “కొంతమంది ఆస్తులు ఇవ్వకపోయినా వాళ్ళు చేసిన పాపపుణ్యాల ప్రతిఫలం ఇచ్చి వెళ్తారు వేద.” అని నవ్వింది కౌసల్య. […]

3 min 10 views
కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 50

ఆ ఇంటికి వచ్చిన కొన్ని గంటల తర్వాత నుంచి ఆ ఫ్యామిలీలో తను కూడా ఒక మెంబర్ అయిన అను కౌసల్యని అమ్మ అని, రఘురామయ్య గారిని డాడీ అని పిలవడం తనకి తెలియకుండానే జరుగుతున్న విషయం.. వెంటనే వచ్చి రఘురామయ్య పక్కన కూర్చోని కౌసల్య కొసరి కొసరి వడ్డిస్తుంటే ఇష్టంగా తింటుంది.       వేద తీసుకొచ్చిన గోంగూర పచ్చడితో ఇష్టంగా తిన్నారు వేద సునంద గారు.    డిన్నర్ కంప్లీట్ చేశాక..”రేపు సండే […]

3 min 6 views