నా బావ..💞1
మొదటి భాగం. చాలా వేగంగా కొట్టేసుకుంటుంది నా గుండె. చేతులు కూడా వణికిపోతున్నాయి, అది నాకు స్పష్టంగా తెలుస్తుంది. కళ్ళెత్తి చూడాలంటేనే కనుపాపలు సహకరించడం లేదు. క్వింటాళ్ల బరువు మోస్తున్నట్టు ఊపిరి అతి కష్టంగా తీసుకుంటున్న నా నుదిటిన చిరు చెమటలు. ఒళ్లంతా గగుర్పాటు.. వద్దు అని చెప్పలని ఉన్న ఆ రెండక్షరాలు నా గొంతు దాటి బయటికి రాలేకపోతున్నాయి. […]