New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

మౌనమే ని భాష

48 stories Ongoing Love Family Drama Suspense

నగరమంతా ఇంకా నిద్రమత్తులో ఉండగానే, శ్రావణి గదిలో చిన్న వెలుగు రేఖలు ప్రసరించడం మొదలయ్యాయి. సరిగ్గా తెల్లవారుజామున ఐదు గంటలు. అలారం మోగక ముందే శ్రావణి కళ్లు తెరిచింది. ఆమెకు అలారంతో పనిలేదు, ఆమెలోని క్రమశిక్షణే ఆమెను మేల్కొల్పుతుంది. మంచం మీద నుండి లేవగానే, తను పడుకున్న దుప్పటిని ఎక్కడా ఒక ముడత కూడా లేకుండా నీట్‌గా మడతపెట్టింది. ఆమె గది ఆమె మనసులాగే చాలా పద్ధతిగా ఉంటుంది.కిటికీ తెరలు జరిపి బయటకు చూసింది. తెల్లవారుజామున వచ్చే ఆ చల్లటి గాలి శ్రావణి ముఖాన్ని తాకినప్పుడు ఆమె పెదవుల మీద ఒక చిన్న మెరుపు లాంటి నవ్వు మెరిసింది. అది కేవలం ఆమెకు, ఆ ప్రకృతికి మాత్రమే తెలిసిన రహస్యం. గది మూలన ఉన్న చిన్న అల్మారాలో…

Browse Stories

మౌనమే ని భాష

మౌనమే ని భాష – 1

నగరమంతా ఇంకా నిద్రమత్తులో ఉండగానే, శ్రావణి గదిలో చిన్న వెలుగు రేఖలు ప్రసరించడం మొదలయ్యాయి.    సరిగ్గా తెల్లవారుజామున ఐదు గంటలు. అలారం మోగక ముందే శ్రావణి కళ్లు తెరిచింది. ఆమెకు అలారంతో పనిలేదు, ఆమెలోని క్రమశిక్షణే ఆమెను మేల్కొల్పుతుంది.    మంచం మీద నుండి లేవగానే, తను పడుకున్న దుప్పటిని ఎక్కడా ఒక ముడత కూడా లేకుండా నీట్‌గా మడతపెట్టింది. ఆమె గది ఆమె మనసులాగే చాలా పద్ధతిగా ఉంటుంది.   కిటికీ తెరలు జరిపి […]

4 min 483 views
మౌనమే ని భాష

మౌనమే ని భాష – 2

తెల్లవారుజామున ఆరు గంటలు. సూర్యకిరణాలు కిటికీలోంచి లోపలికి వచ్చి నీ మీద పడుకున్నా ఒక అబ్బాయి ముఖాన్ని తాకుతున్నాయి.    అలారం మోగకముందే వంశీ నిద్రలేచాడు. శ్రావణిలా నిశ్శబ్దంగా కాదు.. ముఖం మీద నీళ్లు చల్లుకుంటూ, అద్దంలో తనని తాను చూసుకుని ఒక చిరునవ్వు నవ్వుకుంటూ తన రోజును మొదలుపెట్టాడు.    వంశీ అంటే ఆ ఇంట్లో ఒక నమ్మకం, ఒక ధైర్యం.కింద హాల్లో అప్పుడే సందడి మొదలైంది.వంశీ.లేచావా నాన్న కాఫీ ఇక్కడే ఉంచాను అని తల్లి […]

3 min 198 views
మౌనమే ని భాష

మౌనమే ని భాష – 3

ఆ రోజు ఉదయం వంశీకి అంతా హడావిడిగా మొదలైంది. ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ డెలివరీ ఉండటంతో త్వరగా ఆఫీస్‌కు వెళ్లాలని సిద్ధమయ్యాడు.   తన రాయల్ ఎన్‌ఫీల్డ్ బండి కీస్ కోసం టేబుల్ మీద వెతికాడు కానీ అక్కడ లేవు.అమ్మా నా బండి కీస్ ఏవి అని వంశీ అరిచాడు.   సరస్వతి గారు వంటింట్లోంచి వస్తూ,అయ్యో.. చెప్పడం మర్చిపోయాను నాన్న. రవి కాలేజీలో ఏదో స్పెషల్ ఈవెంట్ ఉందట, నీ బండి మీద వెళ్తానని పొద్దున్నే […]

4 min 144 views
మౌనమే ని భాష

మౌనమే ని భాష – 4

ఆఫీస్ క్యాబిన్‌లో శ్రావణి తన కంప్యూటర్ ముందు కూర్చుని ఉంది కానీ ఆమె మనసు మాత్రం ఎక్కడో ఉంది.    పని మొదలుపెట్టే ముందు ఒకసారి తన బ్యాగ్ చెక్ చేసుకుంది. ఎప్పుడూ తన చేతికి తగిలే ఆ లేదర్ డైరీ స్పర్శ తగలలేదు.   ఇక్కడే ఎక్కడో ఉండాలి అనుకుంటూ బ్యాగ్ లోని వస్తువులన్నీ పక్కకు జరిపి చూసింది. పెన్నులు, వాటర్ బాటిల్, క్యారియర్ డబ్బా అన్నీ ఉన్నాయి కానీ ఆ డైరీ లేదు.    […]

3 min 185 views
మౌనమే ని భాష

మౌనమే ని భాష – 5

గదిలో చీకటి రాజ్యమేలుతోంది. కిటికీ బయట వర్షం శబ్దం తప్ప మరేమీ వినిపించడం లేదు. శ్రావణి అలాగే కిటికీ పక్కన కూర్చుని, శూన్యంలోకి చూస్తూ తన గతంలోకి జారిపోయింది.   పోయిన ఆ డైరీ స్థానంలో ఇప్పుడు తన ముందున్న కొత్త పుస్తకం వైపు చూస్తుంటే, ఆమెకు తన పదేళ్ల ప్రాయం గుర్తొచ్చింది.   గతం – శ్రావణి 10 ఏళ్ల వయసులో   అది శ్రావణి అమ్మమ్మ ఇల్లు. అప్పుడే అమ్మ, నాన్నలను కోల్పోయిన శ్రావణికి […]

3 min 62 views
మౌనమే ని భాష Premium

మౌనమే ని భాష – 6

ఆదివారం కావడంతో వంశీ ఇంట్లో అందరూ రిలాక్స్‌గా ఉన్నారు. గోపాల్ గారు బాల్కనీలో పేపర్ చదువుతుంటే, సరస్వతి గారు వంటింట్లో టిఫిన్ చేస్తున్నారు. వంశీ ఇంకా నిద్రలోనే ఉన్నాడు.   రవి తన రూమ్‌లో ఏదో వెతుక్కుంటున్నాడు. అన్నయ్యా నా పెన్ డ్రైవ్ నీ బ్యాగ్‌లో పెట్టానా ఒకసారి చూడు అని అరిచాడు.    వంశీ నిద్రమత్తులో అక్కడ సోఫా మీద బ్యాగ్ ఉంది చూడు రవీ.. నాకేం తెలియదు అని బదులిచ్చి మళ్ళీ దుప్పటి ముసుగు […]

3 min 94 views
మౌనమే ని భాష Premium

మౌనమే ని భాష – 7

ఇందులో నీ బాధలు ఉన్నా, నీ రహస్యాలు ఉన్నా అవి నా దగ్గర చాలా గౌరవంగా, భద్రంగా ఉంటాయి. కేవలం నిన్ను చేరుకోవాలనే తాపత్రయంతోనే నేను ఈ సాహసం చేస్తున్నాను. ప్లీజ్.. నన్ను తప్పుగా అనుకోకు అని మొదటి పేజీ తెరుస్తాడు.   వంశీ గదిలో నిశ్శబ్దం ఆవరించింది. చేతిలో ఉన్న డైరీ ఒక పుస్తకంలా కాకుండా, ఒక మనిషి భారమైన హృదయంలా అనిపిస్తోంది అతనికి.   వంశీ మెల్లగా, చాలా గౌరవంగా మొదటి పేజీని తిప్పాడు.అతను […]

3 min 55 views
మౌనమే ని భాష Premium

మౌనమే ని భాష – 8

ఆ రాత్రంతా శ్రావణికి కంటిమీద కునుకు లేదు. కొత్త డైరీలో రాసిన ఆ నాలుగు ముక్కలు ఆమెలోని ఆవేదనను తగ్గించలేకపోయాయి.    తెల్లవారుజామునే నిద్రలేచి, గదిలో ఉన్న వెలుతురును చూసి ఆమెకు ఎందుకో భయం వేసింది. తన సర్వస్వం అయిన ఆ డైరీ ఇప్పుడు,   ఏ అపరిచితుడి చేతుల్లో ఉందో అన్న ఆలోచన ఆమెను నిముషం కూడా ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు.   ఆ రోజు శ్రావణి ఆఫీస్‌కు గంట ముందే బయలుదేరింది. ఆశ చావలేదు. […]

3 min 48 views
మౌనమే ని భాష Premium

మౌనమే ని భాష – 9

మరుసటి రోజు వంశీ ఆఫీస్ కి వెళ్ళాడు.కానీ వంశీకి ఆ రోజు ఆఫీసులో మనసు అసలు కుదురుగా లేదు. తన టీమ్ మెంబర్స్ ఏదో అడుగుతున్నా,     బాస్ ఏదో చెప్తున్నా అతని కళ్ల ముందు మాత్రం ఆ పాత డైరీ అక్షరాలే కదులుతున్నాయి. ఒక చిన్న పాప అంతటి నరకాన్ని ఎలా భరించింది అన్న ప్రశ్న అతన్ని వేధిస్తోంది.   సాయంత్రం ఆరు గంటల వరకు ఆగలేకపోయాడు. ఒక ఇంపార్టెంట్ పని ఉందని అబద్ధం […]

3 min 48 views
మౌనమే ని భాష Premium

మౌనమే ని భాష – 10

నాన్న  నీకు కవిత్వం అంటే ఇష్టం కదా, నీ కూతురు రాసిన ఈ మాటలు బాగున్నాయని ఒక్కసారి నా కలల్లోకి వచ్చి చెప్పవా….   వంశీ ఆ అక్షరాలను చదువుతుంటే అతని కళ్లు నీళ్లతో నిండిపోయాయి. ఆ డైరీ పేజీ మీద ఆమె చిన్నప్పుడు పెన్నుతో వేసిన బుజ్జి బుజ్జి బొమ్మలు,    ఆమె వేదన చూస్తుంటే వంశీకి ఆమెను ఇప్పుడే వెళ్లి గట్టిగా హత్తుకుని నేనున్నాను నీకు తోడుగా అని చెప్పాలనిపించింది.   ఎంతటి ధైర్యం […]

3 min 50 views