మౌనమే ని భాష – 2
తెల్లవారుజామున ఆరు గంటలు. సూర్యకిరణాలు కిటికీలోంచి లోపలికి వచ్చి నీ మీద పడుకున్నా ఒక అబ్బాయి ముఖాన్ని తాకుతున్నాయి.
అలారం మోగకముందే వంశీ నిద్రలేచాడు. శ్రావణిలా నిశ్శబ్దంగా కాదు.. ముఖం మీద నీళ్లు చల్లుకుంటూ, అద్దంలో తనని తాను చూసుకుని ఒక చిరునవ్వు నవ్వుకుంటూ తన రోజును మొదలుపెట్టాడు.
వంశీ అంటే ఆ ఇంట్లో ఒక నమ్మకం, ఒక ధైర్యం.కింద హాల్లో అప్పుడే సందడి మొదలైంది.వంశీ.లేచావా నాన్న కాఫీ ఇక్కడే ఉంచాను అని తల్లి సరస్వతి గారు వంటింట్లోంచి అరిచారు.
గోపాల్ గారు (వంశీ తండ్రి) బాల్కనీలో కూర్చుని వార్తాపత్రిక చదువుతున్నారు. ఆయన రిటైర్డ్ అధికారి కావడంతో ఇంటి నిండా ఒక క్రమశిక్షణ ఉంటుంది.
కానీ వంశీ దగ్గరకు వచ్చేసరికి ఆ క్రమశిక్షణ కాస్తా ఆత్మీయతగా మారుతుంది.వంశీ ఈరోజు ఆఫీస్ నుండి త్వరగా వస్తావా.
నీ తమ్ముడు రవి కాలేజీ ఫీజు కట్టాలి, ఒకసారి వాడితో మాట్లాడు అని గోపాల్ గారు పలకరించారు.వంశీ అప్పుడే టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు.
తప్పకుండా నాన్న రవి ఎక్కడ ఇంకా నిద్రలేవలేదా అని అడుగుతుండగానే,నేను ఎప్పుడో లేచాను అన్నయ్యా జిమ్ కి వెళ్లి ఇప్పుడే వస్తున్నా అంటూ రవి ఉత్సాహంగా లోపలికి వచ్చాడు.
రవికి తన అన్నయ్య అంటే ప్రాణం. వంశీ కూడా తమ్ముడిని ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటాడు.
ఆ ఇంట్లో సరస్వతి గారి మమకారం, గోపాల్ గారి మార్గదర్శకత్వం, వంశీ బాధ్యత, రవి అల్లరి.. ఇవన్నీ కలిసి ఒక పరిపూర్ణమైన మధ్యతరగతి కుటుంబాన్ని కళ్ళకు కట్టినట్టు చూపుతాయి.
వంశీ రెడీ అయి బయటకు వచ్చాడు. తను ఒక ప్రైవేట్ కంపెనీలో సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. వంశీకి తన రాయల్ ఎన్ఫీల్డ్ బండి అంటే చాలా ఇష్టం.
నీట్ గా ఐరన్ చేసిన ఫార్మల్ షర్ట్, చేతికి ఒక స్మార్ట్ వాచ్, హెల్మెట్ పెట్టుకుని బండి స్టార్ట్ చేశాడు.
సిటీ రోడ్ల మీద ట్రాఫిక్ ని చీల్చుకుంటూ వంశీ తన బండి మీద వెళ్తుంటే, అతనిలో ఒక ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది.
రోడ్డు పక్కన ఉన్న గుడి దగ్గర ఆగి తల వంచి నమస్కారం చేసుకోవడం, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగి పక్కన ఉన్న చిన్న పిల్లవాడిని చూసి నవ్వడం..
ఇవన్నీ వంశీలోని సున్నితమైన మనసును తెలియజేస్తాయి. అతను ప్రపంచానికి దూరంగా లేడు, ప్రపంచంతో కలిసి ప్రయాణిస్తున్నాడు.
వంశీ ఆఫీస్ లోకి అడుగు పెట్టగానే ఒక పాజిటివ్ వైబ్ మొదలవుతుంది.గుడ్ మార్నింగ్ వంశీ సార్ అని సెక్యూరిటీ నుండి సాటి కొలీగ్స్ వరకు అందరూ పలకరిస్తారు.
వంశీ తన క్యాబిన్ లోకి వెళ్ళేలోపు అతని బెస్ట్ ఫ్రెండ్ సాయి ఎదురయ్యాడు. సాయి, వంశీ ఇద్దరూ చిన్నప్పటి నుండి స్నేహితులు.
ఏరా వంశీ.ఇవాళ కూడా ఇంతేనా.ఆ మీటింగ్స్, ఆ ప్రెజెంటేషన్స్ తప్ప నీకు ఇంకేం గుర్తుండవా, ఈ వీకెండ్ ఏదైనా ట్రిప్ ప్లాన్ చేద్దాం రా అని సాయి ఆట పట్టిస్తుంటాడు.
వంశీ నవ్వుతూ ముందు ఈ ప్రాజెక్ట్ డెడ్ లైన్ పూర్తి చేయాలి సాయి. ఆ తర్వాతే మిగతావన్నీ అంటాడు.
వంశీ తన టీమ్ మెంబర్స్ తో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు.
ఎవరైనా తప్పు చేస్తే మందలించడం కంటే, దాన్ని ఎలా సరిదిద్దాలో నేర్పించడం అతనికి ఇష్టం. ఆఫీస్ లోని అమ్మాయిలందరికీ వంశీ అంటే ఒక క్రష్.
అతను ఎంత హ్యాండ్సమ్ గా ఉంటాడో, అంతకంటే ఎక్కువ పద్ధతిగా ఉంటాడు. ఎవరితో ఎంతవరకు ఉండాలో అతనికి బాగా తెలుసు.
లంచ్ టైమ్ లో సాయి, వంశీ మరియు మిగతా కొలీగ్స్ కలిసి క్యాంటీన్ లో భోజనం చేస్తూ జోకులు వేసుకుంటారు.
వంశీ పెళ్లి ఎప్పుడురా, సంబంధాలు చూస్తున్నారట కదా అని సాయి అడిగినప్పుడు వంశీ ఒక క్షణం ఆలోచనలో పడతాడు.
అవునురా అమ్మ ఏదో చూస్తోంది. కానీ నా మనసుకి నచ్చే అమ్మాయి తారసపడాలి కదా అని సమాధానమిస్తాడు.
రోజంతా ఆఫీస్ పనులతో బిజీగా గడిపినా, సాయంత్రం అయ్యేసరికి వంశీ ముఖంలో అలుపు కనిపించదు. ఆఫీస్ ముగించుకుని మళ్ళీ తన బండి మీద ఇంటికి బయలుదేరాడు.
మధ్యలో ఒక బుక్ షాప్ దగ్గర ఆగాడు. వంశీకి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. సాహిత్యం, కవిత్వం అంటే అతనికి ఒక ప్రత్యేకమైన అభిరుచి.
ఒక కొత్త పుస్తకం కొనుక్కుని, దాన్ని తన బ్యాగ్ లో పెట్టుకుని మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టాడు.
ఇంటికి వెళ్ళగానే,
హాల్లో కూర్చుని నాన్నతో ఆ రోజు ఆఫీస్ విశేషాలు పంచుకోవడం, అమ్మ చేసే వేడి వేడి టిఫిన్ తింటూ రవితో గొడవ పడటం..
ఇవే వంశీకి అసలైన సంతోషం. రాత్రి పడుకునే ముందు ఆ రోజు జరిగిన మంచి విషయాలను గుర్తు చేసుకుంటాడు.
శ్రావణి ప్రపంచానికి, వంశీ ప్రపంచానికి ఎక్కడా పోలిక లేదు. ఆమెది ఏకాంతం.. ఇతనిది అందరితో కలిసి ఉండే సంబరం.
కానీ ఈ రెండు విభిన్న ప్రపంచాలను కలపడానికి కాలం సిద్ధమవుతోంద………
కొనసాగుతుంది…….
ప్లీజ్ ఇగ్నోర్ మిస్టేక్స్…
Swipe left/right or tap the sides to turn pages