New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

వైదేహి 🏆Winner · 2nd Place

25 stories Completed 🏆Winner · 2nd Place Family Drama Social Drama Inspirational

రామచంద్రపురంసమయం ఉదయం ఏడు గంటల 45 నిమిషాలు. వంటగదిలో ఒకవైపు టిఫిన్ చేస్తూ, ఇంకొకవైపు పిల్లలకి, భర్తకి బాక్సులు కడుతూ ఉన్నారు 38 ఏళ్ల సుజాత గారు.“సుజాత, నాకు ఆఫీస్‌కి టైం అవుతుంది. త్వరగా కానివ్వు,” అంటూ భార్యని ఒకవైపు తొందర పెడుతూ తను రెడీ అవుతున్నారు కోటేశ్వరరావు గారు.తల్లిదండ్రులు ఇలా తమ తమ హడావిడిలో ఉంటే, ఒక సైడ్‌కి ఎవరికీ ఏ డిస్టర్బెన్స్ లేకుండా మూలగా కూర్చొని బుక్ ఓపెన్ చేసి చదువుకుంటుంది 15 ఏళ్ల చిన్నారి వైదేహి.“వైదేహి, ఇంకా చదవడం అవ్వలేదా? త్వరగా చదవడం కంప్లీట్ చేసుకుని చెల్లిని, తమ్ముడిని నిద్రలేపు,” అని సుజాత గారు అరుస్తూ ఉంటే,“అమ్మా, ఒక్క పది నిమిషాలు. అయిపోతుంది,” అంది వైదేహి.“అబ్బబ్బా! స్కూల్ ఆటో…

Browse Stories

వైదేహి

వైదేహి – 1

  రామచంద్రపురం   సమయం ఉదయం ఏడు గంటల 45 నిమిషాలు. వంటగదిలో ఒకవైపు టిఫిన్ చేస్తూ, ఇంకొకవైపు పిల్లలకి, భర్తకి బాక్సులు కడుతూ ఉన్నారు 38 ఏళ్ల సుజాత గారు.   “సుజాత, నాకు ఆఫీస్‌కి టైం అవుతుంది. త్వరగా కానివ్వు,” అంటూ భార్యని ఒకవైపు తొందర పెడుతూ తను రెడీ అవుతున్నారు కోటేశ్వరరావు గారు.   తల్లిదండ్రులు ఇలా తమ తమ హడావిడిలో ఉంటే, ఒక సైడ్‌కి ఎవరికీ ఏ డిస్టర్బెన్స్ లేకుండా మూలగా […]

6 min 141 views
వైదేహి

వైదేహి – 2

కార్డియాలజిస్ట్ అవుతాను మేడం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వెదర్ కండిషన్స్‌కి, పొల్యూషన్‌కి, మనం తినే కల్తీ ఆహారానికి ఎక్కువగా జనాలు హార్ట్ ఎటాక్ బారిన పడుతున్నారు. అందుకే నేను మంచి కార్డియాలజిస్ట్ అయ్యి అందర్నీ కాపాడాలి అనుకుంటున్నాను మేడం అంది వైదేహి నవ్వుతూ.   “అందరూ తనకి క్లాప్స్ కొట్టండి” అని అందరి చేత క్లాప్స్ కొట్టించి, “నువ్వు కచ్చితంగా డాక్టర్ అవుతావురా. నాకు ఆ నమ్మకం ఉంది” అని తనని బ్లెస్ చేసింది టీచర్.   […]

6 min 58 views
వైదేహి

వైదేహి – 3

“ఆ, నేను ఇంకా మీతో అదే విషయం చెబుదాం అనుకున్నానండి. ఇంతలో మీరు అదే విషయం చెప్పారు” అన్నారు సుజాత గారు.   “అమ్మాయికి ముందు రోజే చెప్తాము. ఎప్పటి నుంచి చెప్తే మనసు పాడు చేసుకుంటుంది” అన్నారు సుజాత గారు.   “అలాగే సుజాత, ఇక నేను ఆఫీస్‌కి వెళ్తాను” అని ఆయన ఆఫీస్‌కి వెళ్లిపోతే, పెళ్లిచూపులు రెండు రోజుల్లోనే ఉండటంతో కూతురికి చీర, అలాగే ఆరోజు పెట్టుకోవడానికి కొన్ని నగలు అన్నీ తీసి రెడీ […]

6 min 50 views
వైదేహి

వైదేహి – 4

      అక్కా, నేను పాపని ఇంట్లోకి తీసుకెళ్తాను. అంతా అయిపోయాక మీరు పిలవండి, తనని పంపిస్తాను అంటూ వైదేహిని తీసుకొని అక్కడి నుంచి ఆమె ఇంటికి వెళ్లిపోయారు ఆవిడ.   ఇక్కడ ఒక గంట పాటు మాటలు జరిగిన తర్వాత పెళ్లి మూడు నెలల తర్వాత జరపాలని ముహూర్తం కూడా మాట్లాడేసుకున్నారు ఇరు కుటుంబ సభ్యులు.   ఈ విషయం వాళ్లు వెళ్లిపోయిన తర్వాత కూతుర్ని ఇంటికి పిలిచి తనకి చెప్పారు.   “అదేంటి, […]

6 min 54 views
వైదేహి

వైదేహి – 5

      ఇప్పుడు ఇక్కడికెందుకు అడిగింది వైదేహి కంగారుగా.   “అంటే అమ్మవాళ్లు నీకు నల్లపూసలు వేయాలంట. ఇంకా అమ్మ ఒక్కటే చెప్పింది. నాకు నచ్చింది ఏదో తీసుకునే కంటే, తనకి నచ్చింది తీసుకుంటే తను వేసుకోవడానికి కూడా బాగుంటుంది కదా! మీరు ఇద్దరూ కూడా మాట్లాడుకున్నట్టు ఉంటుంది కదా! వెళ్లు” అని చెప్పింది. అందుకే మళ్లీ వచ్చాను అన్నాడు విక్కీ.   “అవునా?” అని అంటూ విక్కీతో కలిసి బ్లాక్ బీడ్స్ సెక్షన్‌కి వెళ్లింది […]

6 min 51 views
వైదేహి Premium

వైదేహి – 6

“బంగారం రా నా కోడలు” అన్నారు ఊర్మిళ గారు.   “అదే, అదే” అన్నాడు విక్కీ.   “సరే, నువ్వు కూడా ఎక్కువసేపు మేల్కొని ఉండకు. రేపు పొద్దున్నే సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది” అని చెప్పడంతో,   “అలాగే అమ్మ” అని తినేసి, తను కూడా హాయిగా నిద్రలోకి జారుకున్నాడు విక్కీ.   ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే సత్యనారాయణ స్వామి వ్రతం ఉండటంతో ముందుగా ఊర్మిళ గారు తొందరగా లేచి, కోడల్ని, కొడుకుని కూడా […]

6 min 67 views
వైదేహి Premium

వైదేహి – 7

“అది… అది… మీకు నేను చదువుకోవడం ఎందుకు ఇష్టం లేదు?” అడిగింది వైదేహి భయంగా.   ఆ మాటకి ఒక్కసారిగా విక్కీ ఫేస్‌లో ఉన్న నవ్వు మాయమైపోయింది.   విక్కీ ఏం చెప్తాడో, లేదంటే కోపం పడతాడేమో అని భయంతో కళ్లను గట్టిగా మూసేసుకుంది వైదేహి.   “ఇప్పుడు నేనేమైనా చేతకాని వాడిని అని నువ్వు అనుకుంటున్నావా వైదేహి? నేను రెండు చేతులా సంపాదిస్తున్నాను. నువ్వు మళ్లీ చదువుకొని ఇవన్నీ చేయడం ఎందుకు? అయినా ఇప్పుడు నువ్వు […]

6 min 39 views
వైదేహి Premium

వైదేహి – 8

    ఊర్మిళా గారు ఒక స్పూన్ నోట్లో పెట్టుకుని, “చాలా బాగా చేశావురా! మరి వంట అంతగా రాదు అన్నావ్. చాలా బాగుంది,” అన్నారు చిన్న చిరునవ్వుతో.   విక్కీ కూడా పాయసాన్ని టేస్ట్ చేసి, “బాగుంది వైదేహి” అన్నాడు కాంప్లిమెంట్ ఇస్తూ.   వైదేహి అందరి వైపు చిరునవ్వుతో చూసి, తను కూడా తినడం మొదలుపెట్టింది.   చిన్న కూతుర్ని, కొడుకుని సుజాత గారు తన తల్లి గారి ఇంట్లో పెట్టడంతో అక్కడ లేరు […]

6 min 30 views
వైదేహి Premium

వైదేహి – 9

      అది చూడగానే తనకి తెలియకుండానే నోట్లో నీళ్లు ఊరుతూ ఉన్నా కూడా భర్త తిట్టాడు అన్న కోపంతో, “నాకేం వద్దు. నేను అత్తయ్య దగ్గరికి వెళ్తున్నాను” అంటూ చెప్పేసి అక్కడి నుంచి వైదేహి వెళ్ళిపోయింది.   విక్కీ, వైదేహి వెళ్తున్న వైపే చూసి, “దీనికి ఈ చదువు గోల ఏంటి? అంతా బానే ఉంది. ఆ చదువు ఒక్కటి తప్ప! ఇప్పుడు అది చదువుకొని ఎవరిని ఉద్ధరించాలి అనుకుంటూ?” ఆలోచిస్తూ అక్కడి నుంచి […]

6 min 43 views
వైదేహి Premium

వైదేహి – 10

        పెరిగిన పొట్ట తో నిండుగా కనిపిస్తున్న తన భార్యని ప్రేమగా చూసుకొని, తన నుదుటన ముద్దు పెట్టుకుని, తన పొత్తికడుపు మీద చేయి పెట్టి, “బంగారం, డాడీ నీకోసం చాలా వెయిట్ చేస్తున్నాడు రా. తొందరగా వచ్చేయండి. అలా అని మమ్మీని ఎక్కువగా ఇబ్బంది పెట్టకండి. మమ్మీకి ఇబ్బంది అవ్వకుండా సేఫ్‌గా బయటికి వచ్చేయండి. సరేనా?” అంటూ నవ్వుతూ వైదేహి పొత్తికడుపు మీద ముద్దు పెట్టుకున్నాడు.   ఆ తర్వాత వైదేహి […]

6 min 36 views