ఆధ్య… మొదలైన మరో అధ్యాయం… – 2
ఉదయం ఆరు గంటలకు కిటికీలోంచి పడుతున్న సూర్యకిరణాలు ఆద్య ముఖాన్ని తాకుతున్నా… ఆమె చూపు మాత్రం టేబుల్ మీదున్న పుస్తకం మీదే నిలిచింది… నిన్న రాత్రి తన తండ్రి మాట్లాడిన మాటలు పదేపదే గుర్తుకొస్తున్నాయి… ఈ సంబంధం కుదిరితే మనకూ కొంత భారం తగ్గుతుంది… ఆ మాటల్లో తన భవిష్యత్తు కంటే కుటుంబానికి కలిగే ఆర్థిక ప్రయోజనమే ఎక్కువగా కనిపిస్తుంది… తన పెళ్లి వల్ల కుటుంబానికి భారం తగ్గుతుందా…? తనను ఒక బాధ్యతగా చూస్తున్నారా… […]