New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

మాంగళ్య బంధం

166 stories Ongoing Love Family Drama Romance

లక్ష్మీపురం..అది ఒక అందమైన పల్లెటూరు... ఆ ఊరిలో శేఖర్ గారిది  అందమైన చిన్న కుటుంబం.. శేఖర్ గారి భార్య పేరు శాంతి...వారిద్దరి వివాహ బంధానికి, వారివూరి ప్రేమకి గుర్తుగా  ఒక అమ్మాయి పుట్టింది...ఆ అమ్మాయి పేరు ప్రతిమ.. పేరుకి తగ్గట్టే చూడడానికి అందాల బొమ్మ ల ఉంటుంది ప్రతిమ ..ఒక్కగానోక్క కూతురు కావడం తో  శేఖర్, శాంతి ఇద్దరు ప్రతిమ ని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు...ప్రతిమ పెరిగి పెద్దదయింది.. ప్రతిమ ని శేఖర్ గారు డిగ్రీ వరకు చదివించారు.. ప్రతిమ కి కూడా చదువు మీద శ్రద్ద ఉండడం తో చక్కగా చదువుని పూర్తి చేసి డిగ్రీ పట్ట తీసుకుంటుంది..ఇప్పుడు ఆమె వయసు ఇరవై రెండు సంవత్సరాలు..డిగ్రీ పూర్తయిన తరువాత ఇంటి దగ్గర ఖాళీగా ఉండడం…

Browse Stories

మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 106

తన కన్న వాళ్ళని చూడకుండా ఉన్నది ఒక్కరోజే అయినా సరే ప్రతిమకి వాళ్లని చూసి ఎన్నో ఏళ్ళు గడిచిపోయింది అన్న భావన కలగడంతో  ఒక్కసారిగా పరుగున వెళ్లి వాళ్ళ అమ్మని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది ఐ మిస్ యు అమ్మ అంటూ..   దాదాపుగా శాంతి గారి పరిస్థితి కూడా అదే అవడంతో  ఆవిడ కూడా ప్రతిమ ని గట్టిగా హత్తుకుని వెన్ను మీద నిమురుతూ  కన్నీరు కారుస్తూ  ఏడవకు బంగారం..   మన ఇంటికి వచ్చేసావు […]

4 min 43 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 105

ఆమె సపోర్టు కోసం కూడా పట్టుకుని కూర్చోవడం చూసిన ప్రణయ్  ఇంక తను పడిపోదులే అన్న నమ్మకం కలగడంతో బసవ,నంది   (ప్రణయ్ ఎడ్ల పేర్లు అవి )కదలండి అని చెప్పడంతో వెంటనే ఆ ఎడ్లు ఏదో మనుషుల్లానే  ప్రణయ్ మాటలు అర్ధం అయినట్టుగా తల ఆడించి  ముందుకు కాస్త వేగంగా కదులుతాయి..   ఆ దృశ్యాన్ని చూసిన ప్రతిమకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది.. ఇదేంటి ఈ ఎద్దులు ఇతను ఏం చెప్తే అదే చేస్తున్నాయి..   ఎడ్లకు […]

3 min 41 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 104

ప్రణయ్ వితిన్ సెకండ్స్ లొ రియాక్ట్ అయి ప్రతిమని సేవ చేసిన విధానం భరత్ కి కూడా చాలా ముచ్చటగా అనిపించడంతో  నువ్వు చాలా డెవలప్ అయ్యావు బావమరిది అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం చిన్న స్మైల్ ఇచ్చి అబ్బో ఈమాత్రం అయితే మేము కూడా చేస్తాంలే..   భార్య కింద పడిపోతుంటే పట్టుకోవడం గొప్పకాదు మామ.. భార్యను అసలు కింద పడిపోకుండా చూసుకోవడం గొప్ప..   ఆమెకు ఎలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవడం గొప్ప.. […]

3 min 39 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 103

భరత్ తెలివిగా తనని ఇరికించడంతో ప్రణయ్ భరత్ వంక చూస్తు ఏంటి బావ నాకు ఇది అన్నట్టుగా ఎక్సప్రెషన్ పెడతాడు..   మరి ఊరికే భార్య వచ్చేస్తుందా ఏంటి.. ఎవరైనా సరే ఒక్కసారి  ఒక అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వేసి తన భార్యగా చేసుకున్న తర్వాత  ఆమె బాధ్యత ఆ క్షణం నుండి భర్తదే అన్నట్టుగా కళ్ళతోనే చెప్తాడు భరత్..   బావ కళ్ళతో చేసిన సైగలకి అర్ధం తెలిసిన ప్రణయ్  ఏది ఏమయినా ఇది  మాత్రం […]

3 min 42 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 102

కొత్త పెళ్లి కొడుకువి నీకు ఈ పనులన్నీ అవసరమా  నేను చేసుకుంటాను కదా అని భరత్ వారిస్తున్నా సరే ఎన్ని పనులని ఒక్కడే చేసుకుంటావు బావ..   కొత్త పెళ్లి కొడుకు అయితే మాత్రం పనులు చేయకూడదా ఏంటి?  పెళ్ళి నాది పనులు నీవా.. మన ఇంట్లో పనులు మనం చేసుకోవడానికి కొత్త పెళ్లికొడుకు ఏంటి పాత పెళ్ళికొడుకు ఏంటి  ఏమి కాదు కానీ అంటు ఇంట్లో సరుకులు అన్ని సర్దడంలో హెల్ప్ చేస్తాడు ప్రణయ్..   అతను అలా చెప్పేసరికి  […]

3 min 41 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 101

తను ఇలానే అందరితో కలిసిపోయి పరిస్థితులనీ అర్థం చేసుకొని మనుషులతో మంచిగా మసులుకుంటూ సంతోషంగా ఉండడమే కదా నాకు కూడా కావాలి  అని తనలొ తను అనుకుంటాడు ప్రణయ్   ఇంట్లోకి వెళ్లిపోయిన భాను ప్రతిమకి చిన్న చిన్న పనులు చెబుతూ తనే వంట పూర్తి చేస్తుంది..ప్రతిమ కూడా శ్రద్ధగా భాను చేసే ప్రతి పనిని చూస్తూ, భాను ఏం చెప్పినా కాదు అనకుండా చేస్తుంది ..   వాళ్లు టిఫిన్ ప్రిపేర్ చేయడం పూర్తయ్యే లోపల […]

3 min 40 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 100

ఆవిడ మాటలకు ప్రతిమ చిన్నగా నవ్వుతూ  నేను ఇప్పుడు బాగానే ఉన్నాను అత్తయ్య.. అమ్మలా చూసుకునే మీరు నా పక్కనే ఉన్నప్పుడు నాకు ఇంకెందుకు బెంగగా ఉంటుంది..   రాత్రి ఎందుకో అమ్మానాన్న గుర్తొచ్చి అలా అనిపించింది కానీ ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు.. మీరు నాతో ఒక తల్లిలానే ఉన్నారు కాబట్టి.. మీరు పక్కనే ఉంటే మా అమ్మ నాతో ఉన్నట్టుగానే అనిపిస్తుంది అని చెప్తుంది..   హ్మ్ మంచిది బంగారం.. నువ్వు నాలో మీ […]

4 min 107 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 99

ప్రతిమ తనతో ఎలా ఉన్నా సరే, ఇంట్లో వాళ్లతో మాత్రం బాగానే ఉంటుందని ఈ కాసేపట్లోనే అర్థమైన ప్రణయ్ ఇప్పటికి ఇదే సంతోషం అనుకుంటాడు..   ప్రణయ్  ఒక వైపే చూస్తూ ఉండడం గమనించిన స్వీటీ ఏంటి మావయ్య అలానే చూస్తూ ఉన్నావు ఏముంది అక్కడ  అని అమాయకంగా మొహం పెట్టి అడిగింది..   స్వీటీ మాటలకి కొడుకు వైపు చూసినా యశోద గారికి కొడుకు తన గది వైపే చూడడం గమనించి  ప్రతిమ కోసం అలా చూస్తున్నాడని […]

3 min 47 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 98

ముద్దుగా ఉన్న స్వీటీ నే చూస్తూ అనుకోకుండా తల పక్కకి తిప్పిన ప్రతిమకి తన వైపే చూస్తున్న ప్రణయ్ కనిపిస్తాడు..   ఒక్క క్షణం ఇద్దరి కళ్ళు కలుసుకుంటాయి.. వాళ్ళిద్దరూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉండగా  మావయ్య నిన్నే తను నన్ను గిచ్చింది మావయ్య నువ్వు తనని ఏదో ఒకటి చెయ్యి అని బుంగమూతి పెట్టి మరి చెప్తుంది  స్వీటీ ..   పాప మాటలకి ప్రతిమా ప్రణయ్ ఇద్దరు చూపులు పక్కకు తిప్పేసుకుంటారు.. స్వీటీకి […]

3 min 43 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 97

స్వీటీ అడిగిన ప్రశ్నలకి తన వెన్ను మీద చిన్నగా నిమురుతూ అవును కదా బంగారం నువ్వు మాట్లాడింది చాలా తప్పు కదా..   అమ్మకి నువ్వంటే ఎంత ప్రేమ తెలుసా.. తను మిమ్మల్ని కోప్పడుతుంది అంటే తనకి మీ మీద ప్రేమ లేదు అని కాదు.. మీరు సరిగా అన్నం తినకపోతే ఎక్కడ మీ ఆరోగ్యం పాడైపోతుందో అన్న భయం..   మిమ్మల్ని ఆడుకోవడానికి బయటకి పంపించడం లేదు అంటే  పెద్దవాళ్ళు ఎవరూ లేనప్పుడు మీరు బయటకు వెళ్తే మీకు ఎక్కడ […]

4 min 46 views