New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

మాంగళ్య బంధం

166 stories Ongoing Love Family Drama Romance

లక్ష్మీపురం..అది ఒక అందమైన పల్లెటూరు... ఆ ఊరిలో శేఖర్ గారిది  అందమైన చిన్న కుటుంబం.. శేఖర్ గారి భార్య పేరు శాంతి...వారిద్దరి వివాహ బంధానికి, వారివూరి ప్రేమకి గుర్తుగా  ఒక అమ్మాయి పుట్టింది...ఆ అమ్మాయి పేరు ప్రతిమ.. పేరుకి తగ్గట్టే చూడడానికి అందాల బొమ్మ ల ఉంటుంది ప్రతిమ ..ఒక్కగానోక్క కూతురు కావడం తో  శేఖర్, శాంతి ఇద్దరు ప్రతిమ ని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు...ప్రతిమ పెరిగి పెద్దదయింది.. ప్రతిమ ని శేఖర్ గారు డిగ్రీ వరకు చదివించారు.. ప్రతిమ కి కూడా చదువు మీద శ్రద్ద ఉండడం తో చక్కగా చదువుని పూర్తి చేసి డిగ్రీ పట్ట తీసుకుంటుంది..ఇప్పుడు ఆమె వయసు ఇరవై రెండు సంవత్సరాలు..డిగ్రీ పూర్తయిన తరువాత ఇంటి దగ్గర ఖాళీగా ఉండడం…

Browse Stories

మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 96

అది గమనించిన భరత్ భాను చేయి పట్టుకుని ఆపేలోపే ఆమె ముందుకు వెళ్లిపోవడంతో అబ్బా ఈ భానుకి కోపం వచ్చినట్టుందిగా, అనవసరంగా బంగారు తల్లి పొద్దుపొద్దున్నే  ఈ తిక్క దానికి తిక్క రేపింది..   ఇప్పుడు నేను ఈ చిట్టి తల్లి తరఫున ఏం మాట్లాడినా  అంతా నేనే చేసినట్టు నామీద  గయ్యిమని అరుస్తుంది.. సో ఇప్పుడు నేను కాసేపు మౌనంగా ఉండడమే అందరికీ మంచిది..   లేదంటే  చిన్నపిల్ల చిలిపి గొడవ కాస్త చిలికి చిలికి […]

3 min 48 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 95

కూతురు మాట్లాడిన మాటలకి ముందు షాక్ అయిన భరత్ వెంటనే నవ్వుతూ  ఏమైంది బంగారు తల్లి పొద్దు పొద్దున్నే అమ్మ గురించి ఇలా మాట్లాడుతున్నావు..   ఏం చేసింది అమ్మ నిన్ను.. ఎందుకు ఈ బంగారు తల్లికి అమ్మ మీద అంత కోపం వచ్చింది.. ఎందుకు ఈ అమ్మ వద్దని ఇంకో అమ్మని తెచ్చుకుందాం  అంటున్నావు..   ఏ నీకు  ఈ అమ్మ నచ్చలేదా బంగారం అని తన తలని స్వీటీ చిన్ని బొజ్జ మీద చిన్నగా […]

3 min 43 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 94

హ్మ్ ఏదేమైనా ప్రతిమ చాలా మంచిది అని అర్ధం అవుతుంది.. ఈ ఇంటికి తగ్గ కోడలే వచ్చింది అని భరత్, భాను సంతోష పడతారు..   భరత్ బాబు ఇదిగోండి టీ మీరు తాగేసి వీటిని తీసుకెళ్లి బయట ఉన్న వాళ్ళకి ఇచ్చేసి రండి  అని చెప్తారు యశోద గారు..     హ్మ్ అలాగే అత్తయ్య అంటూ యశోద గారి ప్లేట్లో నుంచి ఒక గ్లాస్ తీసుకొని అక్కడే కూర్చుని టీ తాగుతూ ఉన్న భరత్  […]

4 min 51 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 93

భాను నోట్లో నుండి ఆ మాటలు వినగానే భరత్ కి రాత్రి ప్రణయ్ చెప్పిన మాటలు ఒక్కసారిగా గుర్తు వస్తాయి.. వాట్ అంటే ప్రణయ్ ఊహించింది నిజమా ప్రతిమాకు ఈ పెళ్లి నిజంగానే ఇష్టం లేదా..   అందుకే ఎవరికీ చెప్పా పెట్టకుండా ఎక్కడికైనా వెళ్లిపోయిందా ఏంటి అంటూ అనుమానంగా రకరకాలుగా ఆలోచిస్తుంటాడు అతని మనసులో..   మళ్లీ వెంటనే  ఊహు నేను అలా ఆలోచించడం  కూడా తప్పే.. ముందు అసలు ప్రతిమ ఎక్కడ ఉందో ఎక్కడికి […]

4 min 53 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 92

కష్టం లేదు ఏమీ లేదు నువ్వు నాకు ఎప్పుడు చిన్నపిల్లవే అనుకో మా.. అయినా మా చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే ఉన్నావు కదా ఇప్పటివరకు పడ్డ కష్టం చాల్లే..   ఇప్పుడైనా కాస్త విశ్రాంతి తీసుకో.. ఏమైంది నేను ఉన్నాను కదా నాకు వచ్చినంత వరకు నేను చేసుకుంటానులే అంటు తల్లిని  వారిస్తూ తనే నీళ్లు అన్ని మోస్తూ ఉంటాడు ప్రణయ్..   అబ్బా ఒక్కడివే ఎంతసేపు అని తెస్తావు నాన్న నేను కూడా సాయం చేస్తాను […]

3 min 52 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 91

నువ్వు  ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకుండా పడుకుని రేపు రాత్రి కి జరగబోయే కార్యం గురించి  కలలు కను సరేనా అంటు కన్ను కొడతాడు భరత్..   అప్పటి వరకు ఏదేదో ఆలోచిస్తున్న ప్రణయ్  భరత్ లాస్ట్ లో మాట్లాడిన మాటకి, అతను చేసిన చిలిపి పనికి చిన్నగా నవ్వుతాడు..   ప్రణయ్ నవ్వడం చూసి  ఏయ్ ఏయ్ అదంత సిగ్గే అంటు కాసేపు ప్రణయ్ ని ఆట పట్టిస్తాడు భరత్ .. […]

3 min 49 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 90

ఆవిడ మాటలు విన్న వెంటనే అదేంటి అత్తయ్య అలా అంటున్నారు  అంటే మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉందా  అని అనుమానంగా అడిగింది  ప్రతిమ..   నా అనారోగ్యం కొత్తగా వచ్చింది ఏమీ కాదులే తల్లి.. మీ మామయ్య గారు చనిపోయినప్పుడే నా ఆరోగ్యం పాడైంది..   ఎక్కువగా ఆలోచించి ఆలోచించి ఆందోళన ఒత్తిడి ఎక్కువ అవడం వల్ల రక్తపోటు వచ్చింది.. అది కాస్త గుండెపోటుకు దారి తీసింది..   అప్పుడు నా కొడుకు నన్ను ఎన్నో […]

4 min 75 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 89

తను కట్టెల పొయ్యి ముందు కూర్చుని  ఒకవైపు కారిపోతున్న చెమట బయట చెంగుతో తుడుచు కుంటూ, మరొక చేత్తో పొయ్యిలో కట్టెలు పెట్టి గొట్టంతో ఊపుతూ ఉన్నట్టుగా వున్న దృశ్యం ఆమె కళ్ళ ముందు కనపడగానే  బాబోయ్ నా పరిస్థితి ఏంటి మరి ఇంత దారుణంగా తయారయ్యింది..   ఈ రోజుల్లో గ్యాస్ స్టవ్ కూడా లేని వాళ్ళు ఉన్నారా.. ఎంత పల్లెటూరు అయితే మాత్రం అందరి ఇళ్లల్లో గ్యాస్ స్టవ్లు ఉన్నాయి కదా..   మరి […]

3 min 46 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 88

హహహ ఈ ఇంట్లో నేను మాత్రమే నచ్చానా..ఇంకెవరూ నచ్చలేదా నీకు అని సాగదీస్తూ ఇంతకీ నీకు మా అబ్బాయి నచ్చాడా లేదా మరి అని అల్లరిగా అడిగారు యశోద గారు..   ఆమె నుండి అలాంటి ప్రశ్న ఊహించని ప్రతిమ ముందు  షాక్ అవుతుంది.. తరువాత ఏం చెప్పాలో అర్థం కాక కాస్త తడబడుతుంది..   ప్రతిమ తడబాటుని, కంగారు ని సిగ్గుగా భావించిన యశోద గారు  హహహ నేను ఊరికే అడిగాను లే నువ్వు ఇబ్బంది […]

3 min 45 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 87

సరిగ్గా  అదే సమయంలో ఎవరిదో చెయ్యి ఆమె భుజం మీద పడుతుంది.. దెబ్బకి ఉలిక్కి పడి వెనక్కి తిరిగి చూసిన ప్రతిమ  అక్కడున్న వ్యక్తి ని చూసి షాక్ అవుతుంది…   టక్కున  పక్కకి తిరిగి తన కనురెప్పల నుండి కారుతున్న కన్నీటిని గబగబా తుడి చేసుకుని  అ.. అత్తయ్య మీరా.. మీరేంటి ఇక్కడ ఈ టైమ్ లో అని అడిగింది తడబడుతూ..   హహహ నేనే లే.. నేను కాక ఇంకెవరు అనుకున్నావు అని నవ్వుతు అడిగారు యశోద […]

3 min 45 views