New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

వాలం

14 stories Ongoing Thriller Suspense Mythology

   పడమట సూర్యుడు అస్తమించి అరగంట కావస్తుంది. చీకటి జడలు విప్పి దిక్కుల్లో పరచుకుంటుంది. ఆ ప్రాంతం అంతా దట్టమైన అటవీ ప్రాంతం. ఎత్తయిన, దట్టమైన చెట్లతో ఆకాశాన్ని మూసేస్తుంది.  అన్నిరకాల జంతువులకి నివాసం.. ఆ అడవి. కీచురాళ్ల రొద అప్పుడప్పుడు తీతువు పిట్ట కూతలు.. ఉన్నట్టుండి ఎక్కడ్నుంచో వినిపిస్తున్న నక్క ఊళలు.. భయానక వాతావరణాన్ని తలపిస్తున్నాయి. అడవి కి కిలోమీటర్ దూరంగా విశాల మైన పచ్చిక బయలు లో ఉన్న టెంట్ హౌస్ ముందు నెగడు వెలుగుతూ ఉంది. టెంట్ హౌస్ లో లాంతరు వెలుతురు పలచగా పరుచుకుని ఉంది.లోపల మూలగా ఉన్న ఫోల్డింగ్ టేబుల్ మీద.. ఉంది ఆ లాంతరు. ఆ టేబుల్ ముందు వేసున్న కుర్చీ లో కూర్చుని డైరీ రాసుకుంటున్నాడు…

Browse Stories

వాలం

వాలం – 4

అసలు పొగరు తక్కువ లేదు ఈ పిల్లకి..అనుకున్నాడు కోపంగా అరవింద్.    మహిత.. నీకు జరిగింది ఏది తెలియదు నువ్వు కాస్త నోరు మూసుకొని ఉంటావా.. నీకు ఈవిడ మేనత్త అవుతుంది.. మా వదిన చాలా మంచిది.. పెళ్లి కాక ముందు మేమిద్దరం స్నేహితురాళ్ళలా ఉండే వాళ్ళం.. మా అన్నయ్య నా పెళ్లి ని అంగీకరించలేదు.. ఎందుకంటే నేను చేసుకుంది ప్రేమ వివాహం.. పైగా కులం కాని వాడిని చేసుకున్నానని ఆయనకి కోపం వచ్చింది.. అందుకే మీ […]

5 min 13 views
వాలం

వాలం – 3

నవ కలేబర యాత్ర మొదలయింది. బాధాతప్త హృదయాలతో జగన్నాధుడికి.. వీడ్కోలు చెప్పడానికి అశేష జన సందోహం అక్కడ ఉన్నారు.  ఆ జనంలో ఎవరు తొక్కేసుకోకుండా జాగ్రత్తగా తల్లిని.. తీసుకుని బయలుదేరాడు అరవింద్.    చాలామంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.. జై జగన్నాథ్ అంటూ బిగ్గర్గా అరుస్తున్నారు. అత్యంత బాధాకరమైన పరిస్థితి అది. భగవంతుడికి అంత్యక్రియలు చేసే ఆ సంప్రదాయం పూరీలో మాత్రమే జరుగుతుంది.    కన్నీళ్లు పెట్టుకున్న తల్లిని చూస్తూ.. అమ్మ ఏంటిది.. మళ్ళీ కొత్త విగ్రహాలు పెడతారు.. […]

5 min 24 views
వాలం

వాలం – 2

“ఈ అడవి జోలికి వస్తే ప్రాణాలతో తిరిగివెళ్లవు.. వెంటనే వెళ్ళిపో.. లేదంటే నీ చివరిరోజు ఇక్కడే అవుతుంది” అన్న అక్షరాలు చూసి.. భయం తో అతడి గొంతు తడారిపోయింది.   ఏంటిది ఎవరు రాసారు ఇది..?? అనుకుంటూనే అక్షరాలని బాగా గమనించాడు మహదేవ్.   గుండ్రంగా ముత్యాలు పేర్చినట్టుగా ఉన్నాయి.. అక్షరాలు వెనుక పసుపు రాసినట్టు ఉంది.. పసుపు రాసి దాని మీద అక్షరాలు రాస్తే ఎలా ఉంటుందో అలా ఆ అక్షరాలు హైలెట్ చేయబడి ఉన్నాయి.  […]

5 min 23 views
వాలం

వాలం – 1

   పడమట సూర్యుడు అస్తమించి అరగంట కావస్తుంది. చీకటి జడలు విప్పి దిక్కుల్లో పరచుకుంటుంది. ఆ ప్రాంతం అంతా దట్టమైన అటవీ ప్రాంతం. ఎత్తయిన, దట్టమైన చెట్లతో ఆకాశాన్ని మూసేస్తుంది.  అన్నిరకాల జంతువులకి నివాసం.. ఆ అడవి. కీచురాళ్ల రొద అప్పుడప్పుడు తీతువు పిట్ట కూతలు.. ఉన్నట్టుండి ఎక్కడ్నుంచో వినిపిస్తున్న నక్క ఊళలు.. భయానక వాతావరణాన్ని తలపిస్తున్నాయి.    అడవి కి కిలోమీటర్ దూరంగా విశాల మైన పచ్చిక బయలు లో ఉన్న టెంట్ హౌస్ ముందు […]

5 min 42 views