New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

వైదేహి 🏆Winner · 2nd Place

25 stories Completed 🏆Winner · 2nd Place Family Drama Social Drama Inspirational

రామచంద్రపురంసమయం ఉదయం ఏడు గంటల 45 నిమిషాలు. వంటగదిలో ఒకవైపు టిఫిన్ చేస్తూ, ఇంకొకవైపు పిల్లలకి, భర్తకి బాక్సులు కడుతూ ఉన్నారు 38 ఏళ్ల సుజాత గారు.“సుజాత, నాకు ఆఫీస్‌కి టైం అవుతుంది. త్వరగా కానివ్వు,” అంటూ భార్యని ఒకవైపు తొందర పెడుతూ తను రెడీ అవుతున్నారు కోటేశ్వరరావు గారు.తల్లిదండ్రులు ఇలా తమ తమ హడావిడిలో ఉంటే, ఒక సైడ్‌కి ఎవరికీ ఏ డిస్టర్బెన్స్ లేకుండా మూలగా కూర్చొని బుక్ ఓపెన్ చేసి చదువుకుంటుంది 15 ఏళ్ల చిన్నారి వైదేహి.“వైదేహి, ఇంకా చదవడం అవ్వలేదా? త్వరగా చదవడం కంప్లీట్ చేసుకుని చెల్లిని, తమ్ముడిని నిద్రలేపు,” అని సుజాత గారు అరుస్తూ ఉంటే,“అమ్మా, ఒక్క పది నిమిషాలు. అయిపోతుంది,” అంది వైదేహి.“అబ్బబ్బా! స్కూల్ ఆటో…

Browse Stories

వైదేహి Premium

వైదేహి – 25

      అది మరి వైదేహి, మన పాప మెచ్యూర్ అయింది. నీకు, అమ్మ, అత్తయ్య చెబుదామని అన్నారు. కానీ నేనే ఆపేశాను. ఎగ్జామ్స్ కదా, అందుకే అని అన్నాడు విక్కీ.   “అలా అని నా కూతురు జీవితంలో జరుగుతున్న మొదటి శుభకార్యంలో నేను లేకుండా చేసేస్తావా, విక్కీ!” అంటూ వెంటనే కాల్ కట్ చేసేసింది వైదేహి.   విక్కీ తర్వాత ఎన్ని సార్లు కాల్ చేసినా కూడా వైదేహి కాల్ లిఫ్ట్ చేయకుండా, […]

10 min 60 views
వైదేహి Premium

వైదేహి – 24

        ఇక ఫుడ్ తీసుకున్న తర్వాత ఇద్దరూ మాట్లాడుకుంటూ అక్కడే తినేసి, ఒకరికొకరు గుడ్ నైట్ చెప్పుకుని, ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుని తమ రూమ్స్‌కి వెళ్లిపోయారు.   వైదేహి రూమ్‌లోకి రాగానే భర్తకి కాల్ చేసింది.   కానీ విక్కీ బాగా నిద్రపోతూ ఉండటంతో కాల్ లిఫ్ట్ చేయకపోతే, పడుకొని ఉంటాడు అనుకొని వైదేహి కూడా భర్తకి గుడ్ నైట్ మెసేజ్ పెట్టేసి, ఆ తర్వాత అత్తమామలతో మాట్లాడి కాల్ కట్ […]

8 min 47 views
వైదేహి Premium

వైదేహి – 23

      “చిందులు తొక్కుతూ గొడవకి దిగితే, విక్కీ కూడా భార్య అల్లరిని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు.   ఇక ఒక్కొక్కటి అన్నీ సర్దుకోవడం మొదలుపెట్టింది వైదేహి. ఉన్న 15 రోజులు తన ఫ్యామిలీతో మంచిగా టైమ్ స్పెండ్ చేయాలి అని, ఉన్న టైమ్ మొత్తం కేవలం అత్తమామలకి, భర్తకి, కూతురికి మాత్రమే ఇస్తూ, ఎక్కువగా కూతురితోనే టైమ్ స్పెండ్ చేస్తూ ఉంది వైదేహి.   అలా చూస్తూ ఉండగానే 13 రోజులైపోయాయి. ఇక భార్యని […]

6 min 50 views
వైదేహి Premium

వైదేహి – 22

      వైదేహి తల రుద్దుకుంటూ విక్కీ వైపు చూస్తూ తిరిగి తండ్రితో మాట్లాడుతూ ఉంది.   కోటేశ్వరరావు గారు కూతురు, అల్లుడు మధ్య ఉన్న బాండ్‌కి నవ్వుకొని ఇద్దరితో మాట్లాడుతూ ఉన్నారు.   మన శ్రీనిక మాత్రం తన మామ, పిన్నితో ఆడుకుంటూ టైమ్ గడుపుతూ ఉంది. అసలు వాళ్ల దగ్గరికి వెళ్తే ఇంకా మిగతా ఎవరు గుర్తు రానట్టు వాళ్లతోనే ఆడుకుంటూ ఉంటుంది మన పాప.   ఆరోజు సాయంత్రం వరకు అక్కడే […]

6 min 42 views
వైదేహి Premium

వైదేహి – 21

      “ఏమైంది?” అడిగారు విశ్వనాథ్ గారు, ఊర్మిళా గారు.   వాళ్లు అడగడంతో వైదేహి మెల్లగా కళ్ళు తెరిచి భర్త వైపు భయంగా చూస్తూ ఉంది.   “టూ మార్క్స్‌తో ఫెయిల్ అయిపోయింది” అన్నాడు విక్కీ.   అంతే! ఆ మాటకి ఒక్కసారిగా ముగ్గురి గుండెల్లో బాంబు పడినట్టు అయింది.   “ఏం మాట్లాడుతున్నావ్ రా? రెండు మార్కులతో పోవడం ఏంటి?” అడిగారు ఊర్మిళా గారు.   వైదేహికి కళ్ళల్లో నీళ్లు కాదు, రక్తం […]

6 min 37 views
వైదేహి Premium

వైదేహి – 20

    “చూద్దాం, ముందైతే రిజల్ట్ రానివ్వు. నాకైతే నువ్వు కచ్చితంగా క్వాలిఫై అవుతావు అనిపిస్తుంది. ఎందుకంటే నీ కష్టం ప్రతిరోజూ చూశాను కదా! ఎంత కష్టం అనుభవించావో నాకు తెలుసు. కాబట్టి నువ్వు ఎక్కువగా దాని గురించి ఆలోచించకు” అన్నాడు విక్కీ.   ఇక అప్పుడే ఐస్‌క్రీమ్ రావడంతో ఇద్దరూ ఐస్‌క్రీమ్ తినేసి, కొంచెంసేపు అక్కడే కూర్చుని మాట్లాడుకొని, ఆ తర్వాత బ్రౌనీ కూడా తిని ఇంటికి స్టార్ట్ అయ్యారు.   “ఎలా రాశావు మా […]

6 min 34 views
వైదేహి Premium

వైదేహి – 19

      వైదేహి ఇంటర్ ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వగానే నీట్ ఎగ్జామ్స్‌కి రెండు నెలలు ఉండటంతో విక్కీ తనని కోచింగ్‌లో జాయిన్ చేయాలి అని డెసిషన్ తీసుకున్నాడు.   వైదేహి వద్దు అని చెప్పినా, ఊర్మిళ గారు, విశ్వనాథ్ గారు కూడా వైదేహిని కోచింగ్ సెంటర్‌కి వెళ్ళమని సజెషన్ ఇవ్వడంతో ఇక తను కూడా కస్తూరి కోచింగ్ తీసుకుంటున్న ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయింది.   అంటే కస్తూరి ఇంకా నీట్ క్రాక్ చేయలేదు. తను ఇంకా […]

6 min 33 views
వైదేహి Premium

వైదేహి – 18

      పాప ఏబీసీడీలు రాసి తల్లికి చూపించింది.   “అబ్బో, సూపర్!” అంటూ నవ్వుతూ, “ఇప్పుడు వన్, టూ నేర్చుకుందామే” అంటూ స్లేట్ మీద వన్, టూ రాసి అవి పాప చేత దిద్దించింది.   “నువ్వు కొంచెం సేపు పాపను చూడు. నేను పడుకుంటాను” అని అత్తగారు రూమ్‌లోకి వెళ్లిపోతే, వైదేహి కూతుర్ని చదివిస్తూ తనని ఆడిస్తూ ఉంది.   రాత్రికి విక్కీ వచ్చినప్పుడు పాప కోసం కొన్ని చాక్లెట్స్, అవి తీసుకొస్తే […]

6 min 33 views
వైదేహి Premium

వైదేహి – 17

    కుశల ప్రశ్నలన్నీ అయిన తర్వాత, అలా మాటలో మాటగా వైదేహి చదువు గురించి విశ్వనాథ్ గారు కోటేశ్వరరావు గారికి ఇంకా సుజాత గారికి చెప్పారు.   అది విన్న కోటేశ్వరరావు గారు సంతోషపడిపోతే, సుజాత గారు మాత్రం కొంచెం సీరియస్‌గా కూతురి దగ్గరికి వెళ్లారు.   ఊర్మిళ గారు వైదేహి కిచెన్‌లో వంట చేస్తుంటే, “వదినా, ఇప్పుడే వస్తాను” అని కూతుర్ని తీసుకొని తన గదిలోకి వెళ్లారు సుజాత గారు.   “ఏమైందమ్మా? నన్ను […]

6 min 28 views
వైదేహి Premium

వైదేహి – 16

    ఇంటిని నేను చూసుకుంటాను కానీ నువ్వు చదువుకో అన్నారు ఊర్మిళ గారు.   వైదేహి హత్తుకుని కొంచెం సేపు అలాగే ఉండిపోయి, ఆ తర్వాత పాపని దగ్గరికి తీసుకుంది.   కొంచెం సేపు పాపతో ఆడుకున్న తర్వాత తన ఫోన్ ఓపెన్ చేసి గూగుల్‌లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సిలబస్ అంతా చూసి, తన ఫ్రెండ్స్ అప్పటికే ఇంటర్ అయిపోయి ఉండటంతో తన బెస్ట్ ఫ్రెండ్ అయిన కస్తూరికి కాల్ చేసింది. […]

6 min 34 views