New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
Crazy ప్రేమమ్ – 4

Crazy ప్రేమమ్ – 4

“ఉన్నది ఒకటే జిందగీ బావ..అందులో కూడా ఈ పద్ధతులు, పాకుండలు అవసరమా.. పోయి చెడిపోదాం రా బావా..!!” అంటూ బలవంతంగా శివ్ ని లాక్కెల్లి కార్ లో తోసారు ఆ ఇద్దరికీ ఇంకో ఇద్దరు జతకలిసి..

 

శివిన్ తో కలిపి అబ్బాయిలు ఐదుగురు అయితే.. ఇషిత తో పాటు నక్షత్ర కూడా కలిసి ఇద్దరమ్మాయిలతో ఐదుగురు అబ్బాయిలు కలిసి శివ్ కార్ లోనే పబ్ కి స్టార్ట్ అయ్యారు.

 

 

@@@

 

ఉదయం అనసూయ గారితో మాటల్లో, తాను ఈ నెల రోజులు ఉదయం, సాయంత్రం గుడికి వెళ్ళొస్తానని చెప్పింది ఆముక్త.

 

అయితే నేను నీతో వస్తానంటూ అనసూయ గారు చెప్పడంతో.. ఇద్దరూ మంచి ర్యాపో కుదిరి, ఆంటీ అమ్మాయిలా కాకుండా మంచి ఫ్రెండ్స్ లా తయారయ్యారు ఇద్దరు కాసేపట్లోనే..

 

 

ఆముక్త తన తల్లితండ్రులు చనిపోవడం, బాబాయ్ తనని తీసుకోచ్చి కూతురుతో సమానంగా పెంచడం, తాను చదివిన బి టెక్, చేస్తున్న జాబ్ ట్రైల్స్ గురించి చెప్పింది.

 

ఇన్నిరోజులుగా బాబాయ్ మీద ఆధారపడి ఉన్న తనకి.. అంతా కష్టపడి చదువు పూర్తయ్యాక ఇప్పుడు కూడా ఇంకా వాళ్ళ మీదే తన భారాన్ని రుద్దుతున్నట్టుగా అనిపిస్తుంది..

 

శివరాం గారికి కూడా పెద్దగా తాతలు దాచిపెట్టిన ఆస్తులేం మూలగట్లేదు మూలన.. ఏదో అన్నదమ్ములు పంచుకున్నప్పటి ఇల్లు, కొద్దిగా ప్లేస్ ఉంది ఊర్లో..

 

 

ఆముక్త తండ్రికి సంబందించిన భాగం ఆమె పేరు మీదే రిజిస్టార్ చేయించాడు శివరాం..అదేప్పటికైనా తనకే చెండాల్సింది అని, ఆ ప్లేస్ మీద మనకెలాంటి హక్కు, అధికారం ఉండదని ముందుగానే భార్యకి చెప్పాడు.

 

 

కాసేపు మాట్లాడి వెళ్లిన ఆముక్త, ఇంట్లోకెళ్లి కాసేపు జాబ్ ట్రయిల్స్ కోసం, కొన్ని కంపెనీలకి రెస్యూమ్ పంపించాక, ఓ రెండు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చేసి, సాయంత్రం వరకు టైమ్ కరిగించింది..

 

సాయంత్రం శివరాం, సుకన్య వాళ్ళు వచ్చే టైమ్ కి స్నాక్స్ చేసి పెట్టి తన రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అయ్యి పూజ చేసుకున్న ఆమె, అనసూయ గారిని తీసుకుని పక్క వీధిలో ఉన్న శివాలయానికి వెళ్ళింది.

 

 

కొడుకు కూడా అదే టైమ్ కి వస్తాడని తెలిసిన అనసూయ.. వచ్చేసరికి తాను లేనని ఎక్కడ కంగారు పడతాడో అని ముందుగానే శివ్ నంబర్ కి ఫోన్ చేసింది.

 

 

ఫ్రెండ్స్ చెడిపోదాంరా అనగానే అలాగెరా అంటూ పబ్ కి వెళ్లిన శివ్ టీమ్ తో కలిసి పబ్ లో దూరి తీర్థం పుచ్చుకోవడంలో బిజీ అయ్యాడు.

 

డీజే హోరులో శివాలెత్తినట్టు చిందులు వేస్తున్న ఫ్రెండ్స్ ని చూస్తూ లైట్ బీర్ సిప్ చేస్తున్న శివ్ బాబుకి తల్లీ చేసే ఫోన్ సౌండ్ వినిపించక..

 

 

“లెట్స్ డాన్స్ శివ్..!!” అంటూ వచ్చిన నక్షత్రను సున్నితంగా సైడ్ చేసి ఫస్ట్ బీర్ బాటిల్ ఖాళీ చేసాడు బాబు..

 

 

రెండు సార్లు కాల్ చేసి, గుడి దగ్గరకి వచ్చేయడంతో పూజలో బిజీ అయింది తల్లి.

 

నక్షత్రను నెమ్మదిగా సైడ్ చేసిన శివ్ మరో బీర్ ఓపెన్ చేయగానే.. వయ్యారంగా క్యాట్ వాక్ చేస్తూ వచ్చి.. “హేయ్ శివ్..ప్లీజ్ జాయిన్ విత్ మి..!!” అంటూ వచ్చి, శివ్ భుజాన్ని గారంగా గోకింది ఇషిత.

 

“నో ఇషి యూ క్యారియన్ ప్లీజ్..” అంటున్న శివ్ షర్ట్ పట్టుకుని..

 

“ ప్లీజ్.. ప్లీజ్.. శివ్ ఒక్కసారి..!!” అని గారాలు పోయింది ఇషిత..

 

శివ్ మనసులో చిరాకు పడుతూనే తప్పక లేచి డయాస్ మీదకి వెళ్ళాడు శివ్.

 

 

ఓ నాలుగు స్టెప్స్ అలా అలా కాళ్ళాడించి, ఫోన్ వస్తున్నట్టు కలరింగ్ ఇచ్చి, “ఓకే గయ్స్ యూ క్యారియన్ అమ్మ ఫోన్ చేసింది నేను వెళ్ళాలి. “ అంటూ ఫోన్ చూపించి కిందకి దిగిన శివ్ బయటకు వచ్చి చూస్తే.. నిజంగానే అనసూయ గారి నంబర్ నుండి రెండు మిస్డ్ కాల్స్..!!

 

 

‘ అమ్మ నిజంగానే కాల్ చేసిందా..??’ అనుకుని రిటర్న్ కాల్ చేసాడు శివ్.

 

దర్శనం, పూజ, ప్రదక్షిణలు పూర్తి చేసుకుని మండపంలో కూర్చున్నారు ఆముక్త, అనసూయ ఇద్దరు  

 

కాసేపు కూర్చుని ఇక వెళ్ళాలి అనుకుని లేచిన అనసూయ కొడుకుకోసం ప్రసాదం తెస్తానని ఫోన్ ఆముక్త చేతికి ఇచ్చి ప్రసాదాలు పంచుతున్న వైపు వెళ్ళింది..

 

సరిగ్గా అప్పుడే శివ్ నుండి కాల్ వచ్చింది.. కీప్యాడ్ ఫోన్ అవ్వడంతో శివ అన్న పేరు చూసి, ఈ శివా పొద్దున్న తనను కోమాలోకి తీసుకెళ్లి తీసుకొచ్చిన శివా ఒక్కరేనని గెస్ చేసిన ఆముక్త.. మొదటిసారి కాల్ లిఫ్ట్ చేయలేదు.

 

అసలే కొత్త ఏరియా.. అందునా రెండు సార్లు ఫోన్ చేసింది అనసూయ.. పైగా ఇప్పుడేమో కాల్ లిఫ్ట్ చెయ్యట్లేదు.. కొద్దిగా కంగారుగా అనిపించిన శివ్ మళ్ళీ చేసాడు.

 

 

ఆపకుండా రెండోసారి కూడా కాల్ వస్తుండడంతో ఏదైనా ఎమర్జెన్సీ ఏమో అనుకున్న ఆముక్త, అనసూయ గారికోసం చూసింది..

 

ఇంకో ఇద్దరు తర్వాత తనే ఉంది లైన్ లో.. సర్లే లిఫ్ట్ చేసి, రెండు నిముషాలు ఆగమని చెప్దాం అనుకుని, కాల్ లిఫ్ట్ చేసి హలో అంది మెల్లిగా..

 

తల్లీ గొంతు కాదని ఇట్టే పట్టేసిన శివ్.. “ హలో ఎవరూ..?? “ గంభీరంగా అడిగాడు.

 

“నేను ఆముక్త..!!”

 

“ ఏ ముక్త..?? “ పొట్టలో ఉన్న రెండు బీర్స్ డాన్స్ వేస్తుంటే అక్షరాలు గింగిరాలు తిరిగాయి శివ్ నోట్లో..

 

@@@

 

continued…