New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Don’t Escape – 1
Don't Escape 3 min read

Don’t Escape – 1

Copyright Claim:- ఈ కథను కాపీ చేసిన మరియు సొంత రచను రూపొందించిన రచయితల అనుమతి లేకుండా చిత్రం లేదా వివిధ రకాలుగా ఈ కథను ఉపయోగించి భారత కథల చట్టం (1957 సెక్షన్ Act)ప్రకారం తగిన చర్యలు తీసుకోబడును. 

              కథ పేరు :- డోంట్ ఎస్కేప్ 
             రచన :- నితిన్ కుమార్ 
    
ఒక ఏరియాలో ఒక అడవి ప్రాంతం ఉంటుంది 
   అక్కడ ఒక పాడు బడ్డ బంగ్లా ఉంటది అది చూడడానికి చాలా నిశ్శబ్దంగా మరియు కొంచెం భయంకరంగా ఉంటుంది ఒక రోజు ఆ ఏరియా నుంచి ఒక వ్యక్తి వాకింగ్ చేస్తూ పక్కన అటవీ ప్రాంతంలో ఉన్న ఆ బంగ్లా వైపు వెళ్తాడు వాకింగ్ చేస్తు
అలా తాను వాకింగ్ చేస్తూనపుడు అతనికి పక్షుల అరుపులు విపరీతంగా వినిపిస్తాయి అప్పుడు హెడ్ ఫోన్లు పెట్టుకొని వాకింగ్ చేస్తూ వుంటాడు 
అలా ఆ ప్రదేశం అంత వాకింగ్ చేసి అలసిపోయి 
 ఆ వ్యక్తి ఆ అటవి ప్రాంతంలో ఉన్న బంగ్లా పక్కన ఆగి 
చెవులకు పెట్టుకొన్న హెడ్ ఫోన్లు తీసి ముఖానికి పట్టిన చెమట తుడుచుకుని మళ్లీ హెడ్ ఫోన్లు పెట్టుకొని 
వాకింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు  
అప్పుడు పక్షుల అరుపులు బాగా వస్తాయి అతనికి ఏమి అర్ధం కాదు అప్పుడు అక్కడ ఉన్న ఆ బంగ్లా లోపల నుంచి గట్టిగా ఎవరో అరుస్తున్నట్టు వినిపిస్తుంది 
అప్పుడు వాకింగ్ చేయడానికి వచ్చిన వ్యక్తి
చుట్టుపక్కల చూస్తాడు అతకి ఎవరు కనిపించారు 
మళ్లీ వాకింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా మళ్లీ 
ఆ బంగ్లా లోపలి నుంచి అరుపులు విపరీతంగా వినిపిస్తాయి 
అప్పుడు అతను మెల్లగా ఆ బంగ్లా లోపలికి వెళ్తాడు 
లోపల చాలా చీకటిగా భయంకరంగా ఉంటుంది 
అప్పుడు లోపలికి వచ్చిన వ్యక్తి ఎవరు అండి లోపల 
అరుస్తున్నారు అని అంటాడు  
అప్పుడు మళ్లీ మళ్లీ ఆ బంగ్లా లో అరుపులు వస్తాయి plz నన్ను కాపాడండి అన్ని మీకు దండం పెడతా అని గట్టి గట్టిగా అరుస్తున్నట్టు వినిపిస్తుంది అప్పుడు ఆ వ్యక్తి ఆ బంగ్లా లోపల ఉన్న అన్ని రూమ్స్ కి వెళ్తాడు ఆ రూమ్స్ అన్ని లోపల చాలా భయంకరంగా దెయ్యాల బొమ్మలు చేతి రాతలు దెయ్యాల కథలు పుస్తకాలు ఉంటాయి 
ఇంకా ఇంకా అరుపులు విపరీతంగా ఆ బంగ్లా లోపలి వినిపిస్తాయి అప్పుడు అతనికి లోపన అంత ఏమి జరుగుతుందో అర్ధం కాదు అతనికి వెనుక నుంచి ఎవరు వస్తున్నట్టు అనిపించి 
ఒక్కరిగా వెనక్కి తిరిగినప్పుడు ఒక్కసారిగా బ్లాక్ అవుతుంది అప్పుడు తనకు ఎదురుగా ఒక రూమ్ ఉంటది అప్పుడు తను ఆ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లినపుడు అంత చీకటిగా ఉంటది అప్పుడు ఆ రూమ్ లో వెళ్ళి వ్యక్తి హలో ఎవరైనా ఉన్నారా ఇక్కడ అని అడగగా అప్పుడు ఆ చీకటి రూమ్ లో నుంచి పిల్లి అరుపు వచ్చి
పక్కన ఉన్న కిటికీ ఓపెన్ అయ్యి వెలుగు వస్తాది అప్పుడు లోపల ఉన్న వ్యక్తి ఒక్కసారిగా వెనక్కి తిరిగినపుడు 
ఆ రూమ్ లో ఒక వ్యక్తి ని మాస్క్ వేసి కుర్చీలో కట్టేసి 
ఉంటారు అప్పుడు లోపల ఉన్న వ్యక్తి హే ఎవరు నువ్వు ఎవరు నిన్ను కుర్చీలో కట్టేసి పెట్టారు అని 
అతని దగ్గరకి వెళ్ళి చేతులు కాళ్ళకు కట్టిన తాళ్ళు విప్పి ఫేస్ కి ఉన్న మాస్క్ ను తీస్తాడు 
అప్పుడు ఒక్కసారిగా షాక్ అవుతాడు వాకింగ్ కి వచ్చిన వ్యక్తి అతను ఎందుకు షాక్ అయ్యాడు అంటే 
ఆ కుర్చీలో కట్టేసిన వ్యక్తి అచ్చం వాకింగ్ కి 
వచ్చిన వ్యక్తిలా ఉంటాడు అప్పుడు అతనికి ఏమి అర్ధం
కాదు అప్పుడు వాకింగ్ కి వచ్చిన వ్యక్తి అక్కడ నుంచి భయంతో వెనక్కి రెండు అడుగులు వేస్తూ ఉండగా కాళ్లు తడబడి కింద పడతాడు అప్పుడు తనలా ఉన్న వ్యక్తి మాయం అయిపోతాడు కానీ ఆ కుర్చీ అక్కడే ఉంటది అప్పుడు కింద పడిన వ్యక్తి భయంతో అటు ఇటు చూస్తూ ఉండగా సడెన్ గా అతని కాళ్లు పట్టుకుని ఎవరో ముందుకు లాగి ఖాళీగా ఉన్న కుర్చీలో తాళ్ళతో కట్టేసి ముఖానికి మాస్క్ వేస్తారు అప్పుడు బంగ్లా లోపన ఉన్న తలుపులు కిటికీలు అన్ని మూసుకుపోతూ ఉంటాయి 
అప్పుడు వాకింగ్ కి వచ్చిన వ్యక్తి అరుస్తూ ఉండగా 
ఒక హార్రర్ & థ్రిల్లింగ్ BGm తో బయట ఆ బంగ్లా చూపిస్తూ “డోంట్ ఎస్కేప్” అని కథ ముగుస్తుంది.
ఇంకా మరిన్ని క్రైమ్ & సస్పెన్స్ థ్రిల్లర్ చిన్న చిన్న 
కథలు  ఉన్నాయి మీరు చదవాలి అని అనుకుంటే నన్ను ఫాలో చెయ్యండి 
మీ అందరికి నచ్చే మీరు మెచ్చే కథలతో కలుద్దాం 
మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తారు అని 
…….. మీ నితిన్ కుమార్ తెలుగు రచయత…….