New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఈ బంధానికి ఏ పేరు పెట్టాలి?-120

ఈ బంధానికి ఏ పేరు పెట్టాలి?-120

 

అదొక ప్రతిష్టాత్మకమైన పబ్…

ఆ పబ్‌లో పిచ్చెక్కినట్టుగా డ్యాన్స్ చేస్తున్న జంటలను చూసిన నిఖిల్, అందరికీ ఈ విషయం ఎలా చెప్పాలో తెలియక కంగారుపడ్డాడు. తన స్నేహితులందరినీ పిలిచి, తాను చెప్పబోయే విషయం గురించి వాళ్ల ముందు చెప్పడం మొదలుపెట్టాడు…

“గయ్స్… నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అనుకుంటున్నాను.

మీ అందరికీ తెలుసు, మా అమ్మ హాస్పిటల్‌లో క్యాన్సర్‌తో పోరాడుతున్నారని. ఆమెను cure చేయడానికి నాకు కోట్ల కొద్దీ డబ్బు కావాలి.

కానీ ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేసే నాకు వచ్చేది కేవలం రూ.30,000 జీతం. ఆ జీతాన్ని దాచుకుని మా అమ్మ ట్రీట్‌మెంట్‌కు డబ్బులు ఇచ్చేలోపే నేను ముసలివాడినైపోతాను.

ఇప్పుడు నాకు ఒక డీల్ వచ్చింది. ఏంటంటే…  నాకు మామయ్య అయ్యే మునిరత్న ఇక్కడ MLAగా ఉన్నారని మీకు తెలుసు కదా?

ఆయనే నన్ను కాంటాక్ట్ చేశారు. ఆయనకు  కజిన్స్‌లా యాక్ట్ చేయడానికి మన వయసులో ఉన్న కొంతమంది అబ్బాయిలు, అమ్మాయిలు కావాలట.

అది కూడా పారిస్‌లో.

నేను ఒప్పేసుకున్నాను. ఎన్ని రోజులు అని 20, 30 వేల జీతం కోసం ఎదురుచూస్తూ చేతులు కట్టుకుని కూర్చోవాలి?

మనం ఒప్పుకుంటే ఒక నెలలో మన లైఫ్ చాలా జాలీగా ఎంజాయ్ చేసేంత డబ్బు వస్తుంది. అలాగే పారిస్ ట్రిప్ కూడా.

ఏం అంటారు మీరు?” అని అడిగాడు.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue