హృదయ్ కంగారుగా స్పందన ను పైకి లేపి తను కూడా పైకి లేచి కూర్చుని హెయిర్ ను కొద్దిగా పక్కకు జరిపి మెడ దగ్గర పంటి గాట్ల ను చూసి షాక్ అవుతూ స్పందన వైపు చూడగానే స్పందన ఏడుస్తూ వెక్కిళ్ల మధ్య రోషన్ అని మాత్రం అనగలుగుతుంది
హృదయ్ మొహం మొత్తం ఎర్రగా కందిపోయింది కళ్ళు ఎర్రగా చింత నిప్పుల్ల అయిపోయాయి పిడికిలి బిగించి కోపంగా అక్కడి నుండి బయటకు వెళ్తూ వుండగా వెంటనే స్పందన హృదయ్ ను వెనుక నుంచి హగ్ చేసుకుని ఏడుస్తూ ప్లీజ్ హృదయ్ నన్ను వదిలి వెళ్ళకు ఐ వాంట్ యూ ప్లీజ్ డోంట్ లీవ్ మీ అంటూ ఏడుస్తూ వుండడం వల్ల స్పందన బాగా డిస్టర్బ్ అయింది అని అర్తం చేసుకుని తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అక్కడే ఉన్న బెడ్ మీద కూర్చుని తనని వొళ్ళో కూర్చో పెట్టుకుని గట్టిగా గుండెలకు హత్తుకుని ధైర్యం చెప్తూ వున్నాడు
స్పందన హృదయ్ గుండె మీద తల పెట్టుకుని చుట్టూ చేతులు వేసి ఏడుస్తూ నాకు చాలా చాలా బయం వేసింది హృదయ్ నిజంగా నిన్ను చూడకుండా నే చనిపోత అనుకున్నా నిజంగా నువ్వు టైమ్ కి రాకపోయి వుంటే ఈ పాటికి నేను అంటూ చెప్పలేక ఏడుస్తూ ఉంది 😭😭