డిజిపి తో మాట్లాడిన శుభశ్రీని క్యూస్షన్ మార్క్ ఫేస్తో చూశాడు అర్జున్.
చందు వైపు చూస్తూ..” మీ ఫ్రెండ్ ని చూసుకుంటూ ఉండండి నేను వీళ్ళ చెల్లి దగ్గరకి వెళ్తున్న..” అని చెప్పేసి అర్జున్ మొఖాన్ని చూసి తను ఏం అడగాలనుకుంటున్నాడో అర్థమయ్యి సమాధానం చెప్పే పరిస్థితి లేక సైలెంట్ గా బయటకి వెళ్లిపోయింది శుభ శ్రీ.
“ప్రతి జీవితం ఎన్నో సమస్యలతో సాగుతూ ఉంటుంది రా.. కొన్ని మనం చేసుకుంటే ఇంకొన్ని మన తలరాతలో ఉంటాయనుకుంటా..
ఎవ్వరు సంతోషంగా లేరు,అలా అని ఎవరూ బాధని బయటకి చెప్పట్లేదు..” అని అన్నాడు శుభ శ్రీ వెళ్తున్న వైపు చూసి అర్జున్.
“ఇప్పుడు అమ్మ వాళ్ళ కార్యక్రమాలు ఎలారా..!” అని అన్నాడు చందు.