[సీన్: జహ్నవి క్యాబిన్ – మధ్యాహ్నం]
జహ్నవి తన ల్యాప్‌టాప్ స్క్రీన్‌పై చాలా సీరియస్‌గా మెయిల్స్ చెక్ చేస్తోంది. ఆమె ముఖంలో ఒక రకమైన బిగువు ఉంది. రాత్రి జరిగిన సంఘటనలు, బస్సు ప్రయాణం, వివాన్‌తో జరిగిన గొడవ.. ఇవన్నీ ఆమె మనసులో ఇంకా మెదులుతూనే ఉన్నాయి. కానీ ఆ ఆలోచనలను అణచివేసి వర్క్ మీద దృష్టి పెట్టాలని ప్రయత్నిస్తోంది.
సరిగ్గా అప్పుడే తలుపు దగ్గర వివాన్ నిలబడి మెల్లగా పిలిచాడు.
వివాన్: “మేడమ్.. రావచ్చా?”