ప్రస్తుతం – ఆఫీస్ క్యాబిన్]
12:30 AM. ఆఫీసులో అందరూ వెళ్లిపోయారు. జహ్నవి తన క్యాబిన్‌లో ఉన్న లెదర్ కుర్చీలో తల వెనక్కి వేసి అలాగే నిద్రపోయింది. కలలో కూడా పదిహేనేళ్ల క్రితం జరిగిన ఆ ఎయిర్‌పోర్ట్ సీన్, ఆ తర్వాత తన తల్లి హాస్పిటల్ కాల్ గురించి జరిగిన సంభాషణే.
జహ్నవి: (ఉలిక్కిపడి నిద్రలేస్తూ) “ఆహ్!”
హఠాత్తుగా మెలకువ రావడంతో గొంతు ఎండిపోయినట్టు అనిపించింది. ఆఫీస్ అంతా నిశ్శబ్దంగా ఉంది. బయట వర్షం పడుతోంది. సరిగ్గా అప్పుడే క్యాబిన్ డోర్ ‘టక్.. టక్..’ మని మ్రోగింది.