పూర్ణివ్ , ఆ ఫేక్ పేరెంట్స్ అలా వెళ్ళగానే నేరుగా జేష్ఠ కోసం వెతుక్కుంటూ వెళ్ళాడు.
ఎక్కడ వెతికిన జేష్ఠ కనిపించకపోవడంతో ఆహనంగా తన కోసం ఇల్లు అంతా చూస్తూ వెళ్తూ ఉండగా .. కిచెన్ లో నుంచి జేష్ఠ మాటలు వినిపించాయి.
నేరుగా పూర్ణివ్ అడుగులు కిచెన్ వైపు పడ్డాయి .. కిచెన్ లో కౌంటర్ టాప్ మిద కూర్చొని వంట చేస్తున్న గాయత్రి గారితో నవ్వుతూ మాట్లాడుతూ , కాళ్ళు అటు ఇటు ఊపుతూ ఉంది జేష్ఠ.
జేష్ఠ నీ అలా చూసి ఒక్క క్షణం అక్కడే ఆగిపోయాడు పూర్ణివ్ .
గాయత్రి గారితో మాట్లాడుతూ అనుకోకుండా కిచెన్ ఎంట్రన్స్ వైపు చూసిన జేష్ఠ అక్కడ పూర్ణివ్ కనిపించగానే భర్త గారు అంటూ ఆ కౌంటర్ టాప్ దిగి అతని దగ్గరికి వెళ్ళింది.
తన దగ్గరగా వస్తున్న జేష్ఠ నీ చూసి ” మెల్లిగా రా ” అని అరిచాడు.