[ఫ్లాష్‌బ్యాక్ – 15 ఏళ్ల క్రితం]
ఎయిర్‌పోర్ట్ అంతా ప్రయాణికుల సందడితో ఉంది. జహ్నవి తన లైఫ్‌లో ఒక కొత్త చాప్టర్ మొదలుపెట్టబోతోంది. తన గతం ఇచ్చిన గాయాల నుంచి తప్పించుకోవడానికి ఆమెకు కనిపిస్తున్న ఏకైక మార్గం ఈ ప్రయాణమే. జహ్నవి తండ్రి ఆవిడను సాగనంపడానికి వచ్చారు. ఆయన వెంటే జహ్నవి పిన్ని (తల్లి) కూడా వచ్చింది, కానీ ఆమె ముఖంలో ఎలాంటి బాధ లేదు, పైగా ఒక అడ్డంకి తొలగిపోతుందన్న తృప్తి కనిపిస్తోంది.
**నాన్న:** (కళ్లలో నీళ్లతో) “జాగ్రత్తగా వెళ్లమ్మా.. అక్కడ ఏ అవసరం వచ్చినా మీ మామయ్య ఉన్నాడు. నీకు ఏం కావాలన్నా ఒక్క ఫోన్ చేయ్ చాలు. బాగా చదువుకుని పెద్ద ఆఫీసర్‌వి కావాలి.”
ఆయన ప్రేమగా జహ్నవి నుదుటిపై ముద్దు పెట్టారు. జహ్నవి తండ్రిని గట్టిగా హగ్ చేసుకుంది. కానీ తన పక్కనే నిలబడి ఉన్న పిన్ని వైపు మాత్రం కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. ఆమె కూడా ఏమీ పట్టనట్టు మొహం తిప్పుకుని, చేతిలో ఉన్న ఫోన్ చూసుకుంటూ ఏదో లోకంలో ఉంది.
**జహ్నవి:** (నిబ్బరంగా) “బై డాడీ! ఐ విల్ మిస్ యూ!”