జేష్ఠ ఏడుపు చూసి మనసు అంతా బాధగా అనిపిస్తుంటే … ” ఏమి లేదు నాకు బాగోలేదు కదా అందుకే ఇలా ఉన్నాను ” అని చెప్పి జేష్ఠ చెయ్యి విడిపించుకొని బయటికి వెళ్ళిపోయాడు.
జేష్ఠ బయటికి వెళ్లిపోయిన పూర్ణివ్ గురించి ఆలోచిస్తూ … ఆ రూం బాల్కనీ లోకి వెళ్లి అక్కడ స్వింగ్ చైర్ లో కూర్చుని ఏదో దీర్ఘంగా దేని గురించో ఆలోచిస్తూ ఉంటుంది.
జేష్ఠ ఇంకా వాళ్ళ దగ్గర ఉండేది కొన్ని రోజులే అని చెప్పి గాయత్రి గారు జేష్ఠ తో టైం సస్పెండ్ చెయ్యాలి అని జేష్ఠ నీ వెతుక్కుంటూ వెళ్ళి… తనని వెంట పెట్టుకొని షాపింగ్ కి తీసుకొని వెళ్ళారు.
జేష్ఠ రాను అంటున్న కూడా వినకుండా పెద్ద మాల్ కి తీసుకొని వెళ్లి ఆవిడ కంటికి నచ్చిన చీరలు అన్నీ తీసి జేష్ఠ కి చూపిస్తూ …. జేష్ఠ నీ వాటిని ట్రెయిల్ చేసి రమ్మని పంపిస్తూ …