అబ్బా మా బావకి ఇంత మంచి టేస్ట్ ఉందని నాకు ఇప్పటివరకు తెలియదే అయినా నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడే వాడి టేస్ట్ కొంచెం బెటర్ అయినట్టు అనిపించింది ఇప్పుడు ఇంకా బెటర్ అవుతుంది లే అంటూ కన్ను కొడుతూ చెప్పింది మైత్రి
ఆ మాటకి ఏం సమాధానం చెప్పాలో తెలియక సైలెంట్ గా ఉండిపోయింది జనని
ఏంటి కొంపతీసి మా బావ గుర్తొచ్చి సిగ్గుపడుతున్నావా అంటే ఎప్పుడూ కోపంగా విలన్ లా ఉండే మా బావలో కూడా రొమాంటిక్ లవర్ బాయ్ ఉన్నాడన్నమాట ఇంతకీ కుచ్ కుచ్ అయిపోయిందా ఇద్దరి మధ్య అడిగింది మైత్రి ఆటపట్టిస్తూ
అయ్యో నా బాధ దీనికి ఇంకొకలా అర్థం అవుతుందా దేవుడా ఇంతకీ కుచ్ కుచ్ అంట దొంగ మొహంది అనుకుంటూ లేదు అంది జననీ
అయ్యో అమ్మమ్మ చనిపోయింది కదా అందుకని బ్రేక్ పడిపోయింది అనుకుంటా పర్లేదులే ఇటువంటి డేస్ లో ఇంకా బాగా ఒకరి గురించి ఒకరు తెలుసుకొని ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ముందుకి ప్రొసీడ్ ఐపోండి అంది మైత్రి