New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అగ్నిసాక్షి 🔥 – 2

అగ్నిసాక్షి 🔥 – 2

 

పూజ అక్కడికి రావడంతో ఆరు తన లగేజ్ తీసుకుని ఆమె దగ్గరకు వెళ్లింది.

 

“బాయ్ పూజా! నేను ఇంటికి వెళ్తున్నాను. అమ్మ రమ్మని కాల్ చేసింది.”

 

అంటూ పూజకు చెప్పి వీడ్కోలు తీసుకుంది.

 

“ఓకే ఆరు! మళ్లీ ఎప్పుడు వస్తావ్?”

 

అంటూ అడిగింది పూజ.

 

ఆరు వాళ్లు ఉండే రూమ్ నుంచి కిందకు రావాలంటే మెట్లు దిగాలి. అందుకే పూజ కూడా ఆరుతో పాటు మెట్లు దిగుతూ అడిగింది.

 

“ఏమో పూజా! అమ్మ అంత సడన్‌గా ఎందుకు రమ్మందో నాకు కూడా అర్థం కావడం లేదు. మళ్లీ ఎప్పుడు వస్తానో కూడా క్లారిటీ లేదు.”

 

అంటూ ముఖం చిన్నబుచ్చుకుంది ఆరు.

 

“ఏంటే నువ్వు! ఎవరైనా ఇంటికి వెళ్తున్నామంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ నువ్వేంటి ఇలా డల్ అయిపోతున్నావ్?”

 

అంటూ ఆరుని ప్రశ్నించింది పూజ.

 

“నాకు ఇంటికి వెళ్లాలని లేదని కాదు పూజా… వెళ్లాలని ఉంది. కానీ సడన్‌గా ఇలా పిలవడంతో ఇక్కడ నేను చేయాల్సిన పనులు కూడా ఉన్నాయిగా!”

 

అంటూ సమాధానమిచ్చింది ఆరు.

 

తన దగ్గరకు వచ్చే పేషెంట్స్, వాళ్లకు ఇవ్వాల్సిన ట్రీట్‌మెంట్ గుర్తొచ్చి ఆరు కాస్త దిగులుగా కనిపించింది.

 

“వాళ్లని నువ్వు లేకపోయినా వేరే డాక్టర్స్ కూడా చెక్ చేస్తారు కదా! అయినా ఇక్కడ నువ్వు లేకపోతే నీ ఫ్యామిలీ నిన్ను మిస్ అవుతుందేమో!”

 

అంటూ నవ్వుతూ చెప్పింది పూజ.

 

ఆ మాటలకు ఆరు చిన్నగా నవ్వింది.

 

ఇద్దరూ మాట్లాడుకుంటూ కిందకు చేరుకున్నారు. అప్పటికే ఆరు బుక్ చేసుకున్న క్యాబ్ వచ్చి ఉంది.

 

“ఓకే బాయ్ పూజా! ఫోన్‌లో కాంటాక్ట్‌లో ఉంటాను.”

 

అంటూ కారులో కూర్చుంటూ చెప్పింది ఆరు.

 

“రీచ్ అయ్యాక కాల్ చేయ్.”

 

అంటూ పూజ తన చేతిని ఊపుతూ చెప్పింది.

 

“ఓకే చేస్తాను. మిస్ యూ!”

 

అంటూ నవ్వింది ఆరు.

 

అప్పుడే కార్ డ్రైవర్ వెనక్కి తిరిగి,

 

“మేడమ్, ఓటీపీ చెప్పండి.”

 

అని అడగడంతో తన స్లింగ్ బ్యాగ్‌లో నుంచి ఫోన్ తీసింది.

 

“భయ్యా… ఓటీపీ నంబర్…” అంటూ చెప్పింది.

 

“ఓకే మేడమ్!”

 

అంటూ ఓటీపీని కన్ఫర్మ్ చేసుకున్న డ్రైవర్ కారును ముందుకు పోనిచ్చాడు.

 

ఢిల్లీలో ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయి ఉన్నాయి. డ్రైవర్ ఎంత వేగంగా వెళ్లాలని ప్రయత్నించినా ట్రాఫిక్ కారణంగా ముందుకు వెళ్లడం కష్టంగా మారింది.

 

అయినా ఎలాగోలా ఆరు అనుకున్న ఫ్లైట్ టైమ్‌కి ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంది.

 

“సారీ మేడమ్! ట్రాఫిక్ వల్ల లేట్ అయిపోయింది. మీకు ఫ్లైట్ టైమ్ అవుతుంది కావచ్చు. త్వరగా వెళ్లండి.”

 

అంటూ డ్రైవర్ చెప్పాడు.

 

“ఓకే భయ్యా!”

 

అంటూ చిరునవ్వుతో సమాధానమిచ్చిన ఆరు, తన లగేజ్ తీసుకుని ఎయిర్‌పోర్ట్‌లోకి అడుగుపెట్టింది.

 

—

 

యష్ దగ్గర…

 

ఆరుతో మాట్లాడిన తర్వాత యష్ తన హోటల్ రూమ్‌కి చేరుకుని లగేజ్ సర్దుకున్నాడు. తన డ్రెస్సులు, ల్యాప్‌టాప్, ఇతర అవసరమైన వస్తువులన్నీ బ్యాగ్‌లో పెట్టుకుని బయటకు వచ్చాడు.

 

కంపెనీ ఏర్పాటు చేసిన కారులో ఎయిర్‌పోర్ట్‌కి బయలుదేరాడు.

 

కొద్దిసేపటికి ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్న యష్, తన చెక్-ఇన్ ప్రక్రియ పూర్తి చేసుకున్నాడు.

 

ఆ తర్వాత ఫోన్ తీసి ఆరుకి ఓ సాధారణ మెసేజ్ పంపించాడు.

 

I’m starting. See you soon.

 

మెసేజ్ పంపిన వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు.

 

ఆ మెసేజ్ ఆరుకి చేరిందో లేదో కూడా యష్‌కి తెలియదు.

 

మరోవైపు ఆరు కూడా ఎయిర్‌పోర్ట్‌లో తన ప్రయాణానికి సంబంధించిన పనులు పూర్తి చేసుకుంటూ ఉంది.

 

యష్ పంపిన మెసేజ్ చూడకుండానే తన ఫ్లైట్ కోసం బయలుదేరింది.

 

ఇద్దరూ ఒకే గమ్యం వైపు ప్రయాణం మొదలుపెట్టారు.

 

కానీ అక్కడ వాళ్ల కోసం ఎలాంటి పరిస్థితులు ఎదురుచూస్తున్నాయో మాత్రం ఎవరికీ తెలియదు.

 

❤️

 

హాస్పిటల్‌లో…

 

హాస్పిటల్ కారిడార్‌లో ఓ ఆపరేషన్ థియేటర్ ముందు కొంతమంది ఆందోళనగా ఎదురుచూస్తున్నారు.

 

అప్పుడే ఆపరేషన్ థియేటర్‌లో నుంచి బయటకు వచ్చిన ఓ నర్స్, అక్కడే ఉన్నవారిని చూస్తూ అడిగింది.

 

“అమ్మా… ఇక్కడ ఆ అమ్మాయి పేరెంట్స్ ఎవరు?”

 

ఆమె ప్రశ్నకు అక్కడే ఉన్న మధ్యవయస్కులైన దంపతులు ముందుకు వచ్చారు.

 

“వాళ్లు ఇప్పుడే పక్కకి వెళ్లారు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో మాతో చెప్పండి.”

 

అంటూ ఆవిడ సమాధానమిచ్చింది.

 

“అలాగే మేడమ్. కానీ నేను చెప్పే విషయం మీరు ఎలా తీసుకుంటారో అని…”

 

అంటూ కాసేపు ఆగిన నర్స్, చెప్పాల్సిన విషయాన్ని చెప్పింది.

 

“ఆ అమ్మాయిపై ఎక్కువ హోప్స్ పెట్టుకోకండి. ఎందుకంటే ఆ అమ్మాయి చాలా క్రిటికల్ కండిషన్‌లో ఉంది.”

 

అంటూ తన మాటలు పూర్తి చేసి, ఆ ఇద్దరి వైపు చూసింది.

 

ఆ మాటలు వినగానే ఆవిడ ఒక్కసారిగా నిశ్చేష్టురాలైంది.

 

తాను విన్నది నిజమేనా అన్నట్టుగా నర్స్ వైపు చూసింది. ఆ విషయం జీర్ణించుకోలేక, ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక తన భర్త వైపు చూసింది.

 

ఆయన కూడా కాసేపు మౌనంగా ఉండిపోయారు.

 

తర్వాత నర్స్ వైపు తిరిగి,

 

“మేడమ్… మేము తనని చూడొచ్చా?”

 

అని సందేహంగా అడిగారు.

 

“సర్, మీరు ఐసీయూ బయట నుంచి చూడొచ్చు. లోపలికి మాత్రం అనుమతి లేదు. ఎందుకంటే తనకి ఆపరేషన్ జరుగుతోంది కదా!”

 

అంటూ సమాధానమిచ్చింది నర్స్.

 

అప్పుడే లోపలి నుంచి డాక్టర్ పిలవడంతో ఆమె వెంటనే ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్లిపోయింది.

 

ఆమె వెళ్లగానే ఆవిడ తన భర్త షర్ట్ పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంది.

 

“ఏంటి అండి ఇది? మనకంటే చిన్నది… ఇలా అయితే ఎలా? అసలు ఆ అమ్మాయికి ఏమవుతుంది?”

 

అంటూ ఏడుస్తూ అడిగింది.

 

ఆమె పరిస్థితి చూసిన ఆయనకు కూడా బాధగానే ఉన్నా, పైకి మాత్రం ధైర్యంగా కనిపించడానికి ప్రయత్నించారు.

 

“నువ్వే ఇలా డీలా పడిపోతే ఎలా? వాళ్లు నిన్ను ఇలా చూస్తే ఇంకా బాధపడతారు. ముందు నువ్వు కొంచెం కంట్రోల్ అవ్వు.”

 

అంటూ ఆమెను సముదాయించడానికి ప్రయత్నించారు.

 

కానీ ఆమె ఎంతకీ ఏడుపు ఆపడం లేదు.

 

అది గమనించిన ఆయన ఒక్కసారిగా వెనక్కి చూస్తూ,

 

“వాళ్లు వస్తున్నారు.”

 

అన్నారు.

 

ఆ మాట వినగానే ఆవిడ కంగారుగా తన చీర కొంగును చేతిలోకి తీసుకుని కన్నీళ్లు తుడుచుకుంది.

 

ఆయన చూసిన వైపు తిరిగి చూసింది.

 

కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు.

 

“ఏంటి అండి? మీరు వస్తున్నారు అన్నారు. కానీ అక్కడ ఎవరూ లేరేంటి?”

 

అంటూ అయోమయంగా అడిగింది.

 

“నువ్వు ఏడవడం వాడు కానీ చూశాడంటే… వాడికి ఉన్న ధైర్యం కూడా పోతుంది. అందుకే అలా చెప్పాను. ఏం అనుకోకు.”

 

అంటూ ఆమెకు నచ్చజెప్పారు.

 

అంతలోనే అక్కడికి మరో మహిళ వచ్చింది.

 

“అన్నయ్యా… నర్స్ ఏమైనా వచ్చిందా?”

 

అంటూ ఆందోళనగా అడిగింది.

 

“వచ్చింది. కానీ ఇంకా ఏమీ చెప్పలేదు. తన కోసమే మేము ఎదురుచూస్తున్నాం.”

 

అంటూ సమాధానమిచ్చారు ఆయన.

 

మళ్లీ ఆపరేషన్ థియేటర్ వైపు చూస్తూ అక్కడే నిలబడ్డారు ముగ్గురూ.

 

లోపల ఓ ప్రాణం కోసం పోరాటం జరుగుతుంటే… బయట ఆ ప్రాణం తిరిగి తమ మధ్యకు రావాలని ముగ్గురు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.

 

To be continued… ❤️‍🔥