** అజేయ – 19 **
రాఘవ్ ఇండియాకు వెళ్తున్నది కేవలం ఒక రీసెర్చ్ పేపర్ కోసమో, లేదా వెకేషన్ కోసమో కాదు. తనని ప్రతి రాత్రి నిద్రపోనివ్వకుండా వేధిస్తున్న ఆ కలలోని రహస్యాన్ని చేధించడానికి..
I am not searching for history, history is pulling me back, అని అతని అంతరాత్మ అతనికి చెప్తున్నట్టు అనిపించింది..
లాంజ్ లోపల వాతావరణం చాలా ప్రశాంతంగా, క్లాస్‌గా ఉంది. రాఘవ్ ఒక విండో-సైడ్ సోఫాను సెలెక్ట్ చేసుకుని కూర్చున్నాడు. బయట రన్‌వే మీద టేకాఫ్ అవుతున్న ఫ్లైట్స్ నీ చూస్తున్నాడు…