** అజేయ – 57 **
రాఘవ్ అడిగిన ఆ ప్రశ్నకి కాదన్నట్టు సియా తన తలను అడ్డంగా ఊపగా… ఆమె కంటి కొనాల్లో కన్నీరు చేరింది..
సియా పెదవులు మెల్లిగా వణుకుతుంటే మాటలు రావడం లేదు.. ఆమెకి..
తల ని అడ్డంగా ఊపుతున్న సియానే చూస్తూ రాఘవ్ పెదవులపై ఒక వేదనాభరితమైన చిరునవ్వు మెరవగా..
“అవును సియా… అది మాయే అయితే, అది ఏ మాయో తెలుసా? అది మన ప్రేమ మాయ!” అని అంటాడు సియా కళ్ళలోకి చూస్తూ..