** అజేయ – 26 **
ఈ లండన్ నగరం అతనికి ఒక లగ్జరీ లైఫ్ ఇచ్చింది. లండన్ విశ్వవిద్యాలయంలో అత్యున్నత స్థాయి ప్రొఫెసర్ ఉద్యోగం, సమాజంలో ఒక ఎలైట్ గౌరవం, ఒక ప్రశాంతమైన భవిష్యత్తు…
అన్నీ ఇక్కడే ఉన్నాయి.కానీ ఆ క్షణంలో… ఆ మోడ్రన్ లైఫ్ మొత్తాన్ని తను వెనక్కి వదిలేస్తున్నాడనే నిజం రాఘవ్‌కు అర్థమైంది..
ఆ ఉద్యోగం, ఆ హోదా, ఆ విలాసవంతమైన లండన్ సామ్రాజ్యం… ఇవేవీ ఇప్పుడు అతని కళ్లకు కనిపించడం లేదు..