New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అజేయ – 30
అజేయ Premium 3 min read

అజేయ – 30

**   అజేయ  –  30 **

 

సియా అలసటగా ఆ  సోఫాలో వెనక్కి వాలింది.బయట ప్రపంచం ముందు అల్ట్రా-మోడ్రన్ గా, దేనికీ లొంగని అల్టిమేట్ అటిట్యూడ్‌తో కనిపించే సియా… 

 

ఈ ఒంటరి నిశ్శబ్దంలో మాత్రం చాలా సాఫ్ట్‌గా, ఏదో కోల్పోయిన దానిలా ఆ ఒంటరి శూన్యంలో మిగిలిపోయింది..

 

ఆ నిశ్శబ్ద వాతావరణంలో సియా  ఆ గ్యాలరీ లోని తన పర్సనల్ స్టూడియో రూమ్‌లో ఒంటరిగా ఉండగా ఆమె చుట్టూ..చుట్టూ రంగుల సీసాలు, బ్రష్‌లు, సగం గీసిన కాన్వాస్‌లు టేబుల్ మీద చెల్లా చెదురుగా పడి ఉన్నాయి..

 

ఆ గదిలోని ఏకైక విండో గుండా చూస్తే హైదరాబాద్ నైట్ లైఫ్, అప్పుడే పడుతున్న చిన్నపాటి వర్షపు చినుకులు కనిపిస్తున్నాయి..

 

సియా తనే స్వయంగా ఒక కాఫీ ప్రిపేర్ చేసుకోగ  ఆమె చేతిలో ఒక గ్లాస్ బ్లాక్ కాఫీ ఉంది, కానీ ఆమె చూపులు మాత్రం గది మూలలో ఉన్న ఆ ‘అజేయ’ ఖడ్గం పెయింటింగ్ మీదే స్థిరంగా ఉన్నాయి..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue