** అజేయ – 5 **
కానీ ఆమె కళ్లు… అవి అద్భుతంగా ఉన్నాయి. ఆ కళ్లలో మరణ భయం లేదు, కానీ రాఘవ్ కోసం తపన, విడిపోతున్నామనే ఒక అంతులేని వేదన, శతాబ్దాల ప్రేమ స్పష్టంగా కనిపిస్తున్నాయి..
ఆమె శరీరం నుండి రక్తం కారుతోంది, కానీ ఆమె చూపు మాత్రం రాఘవ్ వైపు నుంచే తిప్పుకోవడం లేదు.ఆమె నెమ్మదిగా తన పెదవులు కదిలించింది..
“రాఘవా …”అని పిలుస్తున్నా ఆమె ఆ పిలుపులో ఉన్న ఆర్తి, పెయిన్ రాఘవ్ గుండెల్ని పిండేసింది.. రాఘవ్ కళ్ళలో నుండి అతనికి తెలియకుండానే కన్నీరు జారింది..
ఆమే వాయిస్ మళ్లీ రిపీట్ అయింది…