రేపు వచ్చేటప్పుడు నీ సర్టిఫికెట్స్ తీసుకు రా అన్నాడు…
సరే సర్ అని తల ఆడించి నా మీద అనుమానం వచ్చినట్టు ఉంది… శివయ్యా!!! ఈ గండం నుండి ఎలాగైనా నన్ను గట్టేక్కించు స్వామి అని మనసులోనే దండం పెట్టుకుంది స్వర్ణ…
బామ్మా గారికి సాయంత్రం కాఫీ కావాలంటే పెట్టించి నైట్ కి భోజనం వండి నేను వెళ్ళొస్తాను బామ్మా గారు అంది…
కమ్మటి భోజనం వండి పెట్టావ్ అమ్మాయ్ అని నూరేళ్లు చల్లగా ఉండు అని మెచ్చుకుని వెళ్ళిరా రేపు ఎనిమిది గంటలకే రా అమ్మాయ్… నీ చేత్తో వండిన టిఫిన్ తినాలని ఉంది అన్నారు..