ఎప్పుడు కూల్ గా సరదాగా ఉండే సన్నీ ఫేస్ టెన్షన్ గా కనిపిస్తుంటే… స్వర్ణ గురించి ఎందుకింత టెన్షన్ పడుతున్నాడు అసలు మ్యాటర్ ఏంటి చెప్పే వరకు నేను స్వర్ణ గురించి చెప్పకూడదు అనుకుంది దీప్తి…
బేబీ ఈ అమ్మాయ్ నిజంగా మీ పీజీ లోనే ఉంటుందా???
సన్నీ నే తీక్షణంగా చూస్తూ హ్మ్!! అంది దీప్తి
హమ్మయ్య అనే ఓ రిలాక్స్ ఫీల్ సన్నీ మోహంలో కనిపించి ఆ అమ్మాయ్ గురించి ఎందుకు ఎంక్వయిరీ చేస్తున్నావ్ బేబీ అని అడిగింది..