గత జన్మ జ్ఞాపకాలలోకి వెళ్లిన ఆద్వైత్, వేలవనం గ్రామంలో యువ ఉపాధ్యాయుడైన ఆది జీవితాన్ని చూస్తాడు. మొదటి వర్షంలో చెరువు ఒడ్డున కూర్చొని డైరీ రాస్తున్న ఆది, మల్లెపూల తోట దగ్గర ఓ చిన్న పాపతో నవ్వుతూ మాట్లాడుతున్న మృణాళినిని దూరం నుంచి గమనిస్తాడు. ఆమె అమాయకమైన నవ్వుకు ఆకర్షితుడైన ఆది, తన మనసులో కలిగిన భావాలను డైరీలో రాసుకుంటాడు.
***
ఆమె చూపు తన వైపు పడగానే… ఆది గబగబా డైరీని ముఖానికి అడ్డంగా పెట్టుకున్నాడు.
అది చూసి… మృణాళిని పెదవులపై చిన్న నవ్వు మెరిసింది.
“ఎవరో దాక్కుని నన్నే చూస్తున్నారు అనిపిస్తుంది…” అని తనలో తానే అనుకుంటుండగా.. సరిగ్గా అప్పుడే ఆ పాప మళ్ళీ అక్కడికి వచ్చేసరికి మళ్లీ ఆ చిన్న పాపతో మాట్లాడడం మొదలు పెట్టింది.
కొద్దిసేపటి తర్వాత… ఇద్దరూ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.