New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 14

ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 14

“సరే… నీ ఇష్టం.” అని సుప్రియ కూడా నవ్వుతూ కాల్ కట్ చేస్తుంది….

 

అలా ఆ రోజు మొత్తం అందరూ రేపు ఔటింగ్‌కి వెళ్తున్నామనే సంతోషంలోనే ఉంటారు. పిల్లలైతే రేపు ఎప్పుడు వస్తుందా అని తెగ ఎగ్జైట్ అవుతూ ఉంటారు.

 

ఎట్టకేలకు సండే రానే వస్తుంది. అందరికీ హాలిడే ఉండడంతో సత్య కూడా ఎర్లీ మార్నింగ్‌నే లేచి అందరికీ లంచ్ ప్రిపేర్ చేయడం మొదలుపెడుతుంది.

 

సత్య అంత ఉదయాన్నే లేచి వంట చేస్తుండడం చూసిన అఖిల్, “సత్యా… నీకెందుకు ఇంత శ్రమ? బయట ఎక్కడైనా తినేవాళ్లం కదా.” అని అంటాడు.

 

“అలా ఎలా అండి… మనమే చేసుకుని తీసుకెళ్తేనే అందరూ కడుపునిండా తింటారు. బయట ఫుడ్ అందరికీ సరిపడదు. అత్తయ్య వాళ్లు కూడా బయట సరిగ్గా తినరు కదా… అందుకోసమే అందరికీ ఇష్టమైనవి చేసుకుని తీసుకెళ్తున్నాను.” అని సత్య చెబుతుంది.

 

అఖిల్ ఆమె వైపు చూస్తూ చిన్నగా నవ్వి, “అందరినీ ఇంత బాగా చూసుకుంటావు కాబట్టే అందరూ నిన్ను అంతగా ఇష్టపడతారు.” అని అంటాడు.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue