హై కమాండ్ నుంచి దశరథ్ పటేల్ కి ఫోన్ వచ్చింది.. అన్నిటినీ ఇగ్నోర్ చేసిన దశరథ్ పటేల్ దానిని ఇగ్నోర్ చేయలేక ఫోన్ లిఫ్ట్ చేసి..”హలో సార్..!” అని అన్నాడు.
“పార్టీ మిమ్మల్ని సస్పెండ్ చేసింది.. పార్టీ నుంచి వచ్చే ఎలాంటి లాభాలు మీకు అందవు,మీకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదు.” అని ఒక ముక్కలో తేల్చేసి ఫోన్ కట్ చేసేసారు.
ఇది తనకి ముందే తెలుసు.. కానీ..! ఈ వీడియో వైరల్ అవ్వడం వల్ల తనకి రాజకీయ భవిష్యత్తు ఉండదని తన దిగులు.
అను ధైర్యం చేసి కేసు వేయదు అని తెలిసిన దశరథ్ పటేల్ ఈ వీడియో వైరల్ అవ్వకుండా ఎలా ఆపాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు పెద్ద పెద్ద లాయర్లని కాంటాక్ట్ అవ్వడానికి తన పి ఏ దగ్గర చర్చలు జరుపుతూ.