శైలుని కారులో ఎక్కించుకొని సీట్ బెల్ట్ తనకి పెట్టి,తాను కూడా సీట్ బెల్ట్ పెట్టుకొని గేటు లోపల నుంచి కారు బయటకి తీసుకువస్తూ..” ఏం జరిగినా నీ పక్కన నేను ఉంటాను అక్క,నువ్వు నా దగ్గర ఏది దాచాల్సిన అవసరం లేదు.” అని అన్నాడు శౌర్య రోడ్ ని చూస్తూ శైలుని చూడకుండా.
“నువ్వు నా పక్కన ఉంటావు అని నాకు తెలుసు రా.. కానీ..! ప్రతిదీ చెప్పి నిన్ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు,చెప్పాల్సింది అయితే నీ దగ్గర అస్సలు దాచను.” అని అంది శౌర్యని చూస్తూ శైలు.
“నువ్వు దాచే వాటిలోనే కొన్ని కొన్ని ఇంపార్టెంట్ వి ఉంటాయి,అవి నీకు తెలియకుండానే.
కాబట్టి నా దగ్గర ఏ చిన్నది కూడా దాచకు అక్క..డిస్టర్బ్ చేస్తున్నాను అని మాత్రం అనుకోకు..నువ్వు నాకు డిస్టబెన్స్ కాదు డెస్టిన్ ఇచ్చిన ఇంకో అమ్మవి.” అని అన్నాడు శౌర్య డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూనే.