మనల్ని ఇక్కడకి పంపించిన భగవంతుడికి తెలియదా మనకి ఏమి ఇయ్యాలి అని,ఎలా ఇవ్వాలి అని..” అని అన్నాడు శైలు చుట్టూ చేయి వేసి ప్రేమగా శౌర్య.
“థాంక్యూ రా నాకు ఇలా ధైర్యం చెప్పడానికి మీరందరూ ఉన్నందుకు.. పాపం ఇలా మోరల్ సపోర్ట్ లేని ఆడవాళ్ళ పరిస్థితి ఏంటో..!” అని అంది నిట్టూరుస్తూ శైలు.
“ఏమీ లేని వాడికి ఆ దేవుడే దిక్కు అన్నట్టు అన్నిటికీ ఆ భగవంతుడే ఉంటాడు.
అన్ని ఆయనకే తెలుసు..అన్ని ఆయన చూస్తున్నాడు,అంతా మంచే జరుగుతుంది.” అని అంది కూతురు దగ్గరకి వచ్చి కౌసల్య.