::: ఆరవ భాగం :::
కాలేజీ ప్రధాన భవనం వెనుక భాగంలో ఒక చిన్న గార్డెన్ ఉండేది. మధ్యలో గుండ్రంగా సిమెంట్ బెంచీలు, చుట్టూ పచ్చటి గడ్డి, వరుసగా నిలిచిన అశోక చెట్లు ఉన్నాయి!
ఉదయం కురిసిన వర్షం కారణంగా ఆకులపై ఇంకా నీటి బిందువులు మెరుస్తున్నాయి. అక్కడ ఉన్న సిమెంట్ బెంచీలలో కొందరు స్టూడెంట్స్ కూర్చొని రాసిన పరీక్ష గురించి మాట్లాడుతున్నారు.
అఖిల్ చేతిలో ఉన్న గిఫ్ట్ బాక్స్ వైపు అందరి చూపూ నిలిచిపోయింది. అఖిల్ అక్కడ ఉన్న సిమెంట్ బెంచ్ పైన కూర్చొని ఆ డబ్బా ని తెరిచాడు.
అందులో ఏముందా అని ఆ డబ్బా లోపలకు తొంగి చూసారు అతని చుట్టూరా నిలబడిన వాళ్ళు!
పెద్ద బాక్స్‌లో, అచ్చం ఒకే సైజులో నలుపు రంగు వెల్వెట్ పేపర్‌తో చుట్టిన ఏడు చిన్న చిన్న బాక్స్‌లు ఉన్నాయి. ప్రతి బాక్స్ పై బంగారు రంగులో పేర్లు ఉన్నాయి