ఆ ఆరుగురు కలిసి.. దేశం కోసం తమ ప్రతీకారం కోసం ఇప్పుడు చేయబోయే ఆపరేషన్ ని సిద్ధంగా వున్నాం అని ఒకరికి ఒకరు బలంగా వున్నాం అని అనుకుంటూ ముందుకు కదులుతారు..
ప్రజ్వల్ జ్వాల పక్కన నిలబడి, తన గన్స్ ని లోడ్ చేస్తూ, “లెట్స్ గో.. గేమ్ స్టార్ట్ అయింది,” అన్నాడు గంభీరంగా.
ప్రజ్వల్ వెంటే నడుస్తుంది జ్వాలా ఎలాంటి తడబాటు లేకుండా.. ఆ వెనుకే సిద్దు చేతిని పట్టుకొని అతని వెనుకే వస్తుంది నందిని కూడా..
గచ్చిబౌలి భూగర్భంలో ఉన్న ఆ పాడుబడిన కారిడార్లు ఇప్పుడు పైకి మాత్రం ఒక అత్యాధునిక హరర్ చాంబర్‌ను తలపిస్తున్నాయి..
ఒక్కప్పటి బ్రిటిష్ కాలం నాటి పురాతన డ్రైనేజీ గోడల వెనుక, భారీ కన్క్రీట్ పిల్లర్ల చాటున అమర్చిన ఇనుప గేట్లు డాక్టర్ శివరామ్ నిర్మించిన అక్రమ సామ్రాజ్యానికి సరిహద్దులుగా నిలిచాయి..
లోపల ఎందరో అమాయకుల మీద అక్రమంగా జరుగుతున్న ఇల్లీగల్ మెడికల్ ట్రయిల్స్.. డ్రగ్స్., వాక్సిన్స్ అంటూ ఇతర దేశాల్లో అనుమతులు లేని ఎన్నో వైద్య విధానాలను..