దాంతో తమ ఫ్రెండ్ తమకు ఏదో చెప్పాలి అనుకుంటున్నాడు అని అర్థమై అందరు సైలెంట్ అయిపోయి ఓకే విషయం ఏంటో చెప్పు అంటారు….
రేయ్ ఆ రోజు రాత్రి మీరొక విషయం అబ్సర్వ్ చేసారా మనం జ్వాలని బలవంతం చేస్తున్నప్పుడు పోలీస్ సైరన్ లాస్ట్ లో వినిపించింది సో మనం పారిపోయి వచ్చేసాం ….
అదే సైరన్ మనం ఆమెని ఏమి చేయకముందే వినిపించుంటే అప్పుడు కూడా ఇలానే పారిపోయి వచ్చేవాళ్ళం…
అప్పుడు జ్వాల లైఫ్ మన చేతుల్లో నాశనం కాకుండా సేవ్ అయ్యేది అని అంటాడు ఆరాత్రి గుర్తొచ్చి జ్వాల దీనమైన రూపం మెదిలి బాధగా కళ్ళు మూస్తాడు ..
క్రిష్ అలా చెప్పగానే నలుగురు ఫ్రెండ్స్ ఒకేసారి రేయ్ నువ్వింకా అదే విషయం గురించి ఆలోచిస్తున్నావా.. ప్లీజ్ ఇంక నువ్వు ఆ విషయాన్ని వదిలెయ్ అంటారు..
రేయ్ అది కాదురా… నేను ఈ వారం రోజులు ఎంతో కష్టపడి ఒక డివైజ్ నీ ఫౌండ్ అవుట్ చేసాను.. నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను… దాని గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్తాను ఓకే నా బాయ్ అంటూ కాల్ కట్ చేస్తాడు..