పోలీసులు దిల్ సుఖ్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గరకి చేరుకొని లొంగిపోయిన వాడిని పట్టుకొని చర్లపల్లి జైలు లో విచారించడానికి తీసుకెళ్లడానికి పోలీస్ వాళ్ళు ఆర్మర్డ్ ( armored ) వ్యాన్ పంపించమని కాల్ చేసి చెప్తారు . ఆర్మర్డ్ వ్యాన్ వచ్చేలోపల నాయక్ గ్యాంగ్ అండ్ ఈగల్ 🦅 టీమ్ కూడా చేరుకుంటుంది దిల్ సుఖ్ నగర్ కి . నాయక్ ఈగల్ టీమ్ లో వున్న స్నైపర్ ( మన వినోద్ ను వాచ్ చేసేది ఇతనే ) కి కాల్ చేసి పోసిషన్ లో ఉండి సైలెన్సర్ అటాచ్ చేసి రెడీ గా ఉండు నేను సిగ్నల్ ఇవ్వగానే షూట్ చేసి నువ్వు వెళ్ళిపో అని చెప్తాడు . దానికి వాడు ఒకే అని కాల్ కట్ చేస్తాడు .
కోణార్క్ థియేటర్ ఆపోజిట్ బిల్డింగ్ శ్రీ నిలయం టాప్ లోకి వెళ్ళి పోసిషన్ తీసుకొని నాయక్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తుంటాడు . ఆర్మర్డ్ వ్యాన్ లోకి ఎక్కించే ముందు అందరూ గుమిగూడి ఉంటే బయటకి తీసుకువచ్చి మీడియా ఫోటోలు తీస్తూ లైవ్ కవరేజ్ ఇస్తూ ఉంటే వాడి కాళ్ళకి మెడకి ( మొహానికి ముసుగు వేసి ఉంటుంది ) చేతులకి చైన్ కట్టి ఎక్కించే టైమ్ లో నాయక్ సిగ్నల్ ఇవ్వగానే తలలో బుల్లెట్ దిగుతుంది బుల్లెట్ సౌండ్ కి అందరూ భయంతో పారిపోతుంటే పోలీసులు సౌండ్ వచ్చిన వైపు పరిగెత్తే లోపు ఆకాశం లో నుండి రెండు స్మోక్ బాంబ్స్ కింద పడి ఊపిరి పీల్చుకోవడానికి కూడా కష్ట పడుతూ రోడ్స్ మీద వెహికల్స్ ఆగిపోయి ఎటు పోలేక పోతారు . పోలీస్ వాళ్ళు కళ్యాణ్ జ్యువెలరీ బిల్డింగ్ ఎక్కి చూస్తే టాప్లో ఎవరు ఉండరు . శవాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ హాస్పిటల్లో పంపిస్తారు