ఎపిసోడ్ 15
రెస్టారెంట్ లో కలిసిన విజె తనకు అయ్ లవ్ యు చెప్పడంతో ఒక్కసారి బిత్తరపోయింది స్వప్నిక.
అంతె, ఆమె చేతిలో ఉన్న స్పూన్ కిందపడింది. తరువాత ఏమైందో చదవండి.
స్వప్నిక చేతిలో స్పూన్ కింద పడగానే ఆశ్చర్యంగా చూసాడు విజె.
“వాట్ హపెన్డ్, ఏమైంది?” అడిగాడు విజె.
ఎదురుగా స్వప్నిక ముఖం కంగారు కంగారుగా ఉంది. ఆమె ఊపిరి ఒక్క క్షణం ఆగినంత పనైంది.
ఇంత ఫాస్టా? ఏంటి వీడు? ఇంటర్ నెట్లో సెర్చ్ చేయడానికన్నా టైమ్ పడుతుంది.