ఎపిసోడ్ 26
స్వప్నికను నువ్వు నిజంగానే లవ్ చేస్తున్నవా అన్న మహేష్ అడిగిన ప్రశ్న పూర్తికాక ముందే..
డోర్ శబ్ధం కావడంతో తలెత్తి చూసిన ఇద్దరికి ఎదురుగా మల్లికా మేడం కనిపించింది.
“హాయ్, అత్తయ్య, ఏంటి ఇలా వొచ్చావ్?” అని కంగారుగా అడిగాడు విజె.
దానికి సీరియస్ గా చూసింది మల్లికా మేడం.
“ఏంటో నీకు తెలియదా? నిన్న ప్రోగ్రాం అయ్యాక మాయమైన నువ్వు ఇప్పటి వరకు నాకు ఫోన్ చేయలేదు,
నేను ఫోన్ చేస్తే ఒకసారి నాట్ రీచబుల్, మరోసారి మోగినా ఫోన్ ఎత్తవు.