New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 32

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 32

ఎపిసోడ్ 32

 

కారులో వెళుతున్న విజె స్వప్నికలు దారి తప్పారు. ఫ్యూయల్ లీకవడంతో ఒక అడవి లాంటి ప్రదేశంలో కారు ఆగిపోయింది. 

ఆలోచిస్తూ వెనక్కి చూసిన విజె కళ్ళు ఒక్కసారిగా పెద్దగా తెరుచుకున్నాయ్. తరువాత ఏమయిందో చూద్దాం.

 

వెనక్కి చూసిన విజె కు వాళ్ళ కారు వైపు పెద్ద  మంట వస్తూ కనిపించడంతో అతను ఒక్క క్షణం  ఆలోచించాడు. 

 

“స్వప్నీ, తొందరగా ఇటు వైపు దూకేయ్.” అరిచిన విజె డోర్స్ లాక్ తీసి అతను శబ్ధం కాకుండా దిగి, టక్కున స్వప్నిక వైపు డోరు తెరిచి అయోమయంగా చూస్తున్న ఆమెను బయటకు లాగాడు. 

 

ఇద్దరూ ఒకరిపై ఒకరు పడగానే విజె మెల్లిగా పాకుతూ ముందుకు వెళ్ళగా స్వప్నిక అతన్ని ఫాలో అవుతూ కొద్దిదూరం వెళ్ళి లేచి నిలబడ్డారో లేదో మంటలు మొత్తం కారును చుట్టు ముట్టాయ్.

 

వెనుక నుండి ఎవరో ఇద్దరు వచ్చి ఆ కారును ముందుకు నెట్టడంతో. అది ఫాస్ట్ గా వెళ్ళి ఎదురుగా ఉన్న  లోయలోకి పడిపోతూ ఢామ్ అని పెద్ద శబ్ధం చేస్తూ గాలిలో పేలిపోయి ముక్కలు ముక్కలుగా  లోయలోకి పడిపోయింది. 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue