ఎపిసోడ్ 36
”నిన్నూ,” కోపంగా ముందుకు వెళ్ళింది.
” అసలు నాకు పెళ్ళంటేనే చిరాకు. ఆడదానికి పెళ్ళే ఒక ఉచ్చు. అది బిగుసుకుంటే ఇక అంతె. ఆ ఉచ్చులో నుంచి బయటకు రాలేకా అందులో ఉండలేక నరకయాతన అనుభవిస్తుంది.
అన్నీ సాక్రిఫైజ్ చేసి కుటుంబం కోసం నిలబడి చివరకు వెనక్కి తిరిగి చూస్కుంటే అక్కడ కనిపించేది సున్న.
కనీసం ఆ కుటుంబం కూడా ఉండదు. అసలు ఆడదాన్ని పెళ్ళనే ఉచ్చులో బిగించి, బాధ్యత అన్న పదాన్ని మెళ్ళో వేసి, దానికి సహనం, ఓర్పు, అన్న ట్యాగ్ లైన్స్ తగిలిస్తారు.
కెరిర్ కోసం కష్టపడి పైకి వొచ్చిన ఎంతో మంది పెళ్ళయిన ఆడవాళ్ళు విడాకుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.