New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 37

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 37

ఎపిసోడ్ 37

 

పది నిమిషాల్లో ఇద్దరు ఆడవాళ్ళు, ఇద్దరు మగవాళ్ళు తోడుగా వచ్చి కారు లోని కవర్స్ తీసుకుని విజెను, స్వప్నికను వెంట రమ్మన్నారు. 

 

ఒక పది అడుగులు వేయగానే ఇద్దరిని  చెరో గదిలోకి తీసుకెళ్ళారు. అక్కడ రెడీ కావడానికి డ్రెసింగ్ టేబుల్ నుండి అన్ని హంగులు ఉన్నాయి.

 

ఒక నలభై నిమిషాలకు రూమ్ నుండి బయటకొచ్చిన విజె, స్వప్నికలు ఒకరినొకరు చూసుకున్నారు. ఎరుపు రంగు అంచు ఉన్న తెల్లని  ప్యూర్ సిల్క్ పట్టు ధోవతీ కండువలో, 

 

 విజె, ఎరుపు రంగు పెద్ద బార్డర్ ఉండి గోల్డ్ కలర్ బూటాలున్న కాంజివరం పట్టు చీరలో పెద్ద జడతో సింపుల్ గా ఉన్న స్వప్నిక, 

 

ఇద్దరూ చూడ చక్కని జంటలా ఉన్నారు. నుదుట బాసికం, దాని కింద తీర్చి దిద్దిన కళ్యాణ తిలకం, బుగ్గన చుక్కతో ఇద్దరూ పెళ్ళి బట్టల్లో మెరిసి పోతున్నారు.  

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue