ఎపిసోడ్ 41
పెళ్ళితంతు ముగిసింది కాబట్టి ఈరోజు రిసెప్షన్ లాగ అయ్యింది. అందరూ వధూవరులను ఆశీర్వదించారు.
వచ్వినవాళ్ళందరూ కూడా బంధువులు కాదు. అందరూ బిజినెస్ డీలింగ్స్ ఉన్నవాళ్ళే. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగ మాట్లాడసాగారు.
“ఇదేంటి? ఈ రోజు ఆ పరుషురాం కూతురు లాస్యతో ఎంగేజ్ మెంట్ అనుకుని మరో అమ్మాయిని పెళ్ళి చేసుకుని వొచ్చాడు.”అని ఒకాయన అన్నాడు.
“అదే నాకూ అర్థం కావడం లేదు. ముందు పేపర్లో పెళ్లి న్యూసు, వెనుక పేపర్లో ఎంగేజ్ మెంట్ గ్రీటింగ్స్, వీళ్ళకే చెల్లింది.” మరొకరన్నారు.
“ఇంత జరిగాక పరుషురాం ఊరుకుంటాడా, ఏంజేస్తాడో ఏమో.” మొదటాయన అన్నాడు.