ఎపిసోడ్ 55
బెడ్ రూమ్ లో కొద్దిసేపు మాటల యుద్ధం జరిగాక స్వప్నిక, విజెకి హెడ్ మసాజ్ చేసింది. తరువాత విజె నిదుర లోకి జారుకున్నాడు.
ఇంతలో ఆమె ఫోన్ మొగింది. స్వప్నిక టెన్షన్ గా తన ఫోన్ ని చూసింది. ఆ అన్ నోన్ నంబర్ ఎవరిదో చూద్దాం.
తన ఫోన్ స్క్రీన్ పై కనపడ్డ ఆ అన్ నోన్ నెంబర్ ఎవరిదై ఉంటుందో ఊహించిన స్వప్నిక టెన్షన్ గా అటూ ఇటూ చూసింది.
విజె గాఢ నిద్రలో ఉన్నాడు. వెంటనే ఆమె బయట బాల్కనీ లోకి వొచ్చి కాల్ అటెండ్ చేసింది.
“హ..హలో ఎవరూ?”అని కావాలనే అడిగింది స్వప్నిక.