ఎపిసోడ్ 57
ఆన్సర్ విజెకు ఎందుకో తేడాగా అనిపించింది.
ఇంతలో స్వప్నిక ఫొన్ మోగింది.
“ఏస్, దిసిజ్ స్వప్నికా విజె స్పీకింగ్. ఓకె. థ్యాంక్యూ, ఎవ్రీ థింగ్ కంప్లీటెడ్? యా, యా, అన్నీ రెడీగా ఉన్నాయా? లెవనో క్లాక్ పూజ. నిన్న నేను చెప్పినదంతా గుర్తుంది కదా.”
తనకు ఏమేం కావాలో మళ్ళీ పూర్తిగా లిస్ట్ చెప్పింది. క్యాటరింగ్ దగ్గరి నుండి అన్నీ అడిగి తెలుసుకుంది.
కాల్ కట్ అయ్యాక అందరి వైపు తిరిగింది స్వప్నిక.
“సరే, మరి నేను ఓ గంటలో తిరిగి వొస్తాను. అత్తయ్యా, అన్నీ రెడీ అయ్యాయి.