భాగం – 10
అక్కడ ఏం చేశారో తెలియదు సరిగ్గా 2 గంటల తర్వాత మెల్లిగా వెళ్లిన వీళ్లంతా ప్రాణ భయం తో పరుగులు ఎత్తుతూ మరి కింద పడుతూ లేస్తూనే వీళ్ళ ట్రీ హౌస్ లోకి చేరుకున్నారు.
చేరుకున్న మరు క్షణమే వాళ్ల కోసమే ఎదురు చూస్తున్న వాళ్ళ మనుషుల తో పాటు స్పృహ తప్పి పోయిన గౌతమ్ ని అలానే తీసుకొని అక్కడి నుంచి పారిపోయారు….
పొద్దున అయిపోయింది…
సమయం 7:30…
ఎప్పటి లాగానే ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూనే ఆ కుర్రాళ్ళ కి నీళ్లు ఇవ్వడానికి వెళ్లిన ఆ కుటుంబానికి అక్కడ ఎవ్వరూ కనిపించక, “అరే ఏమైపోయారు వీళ్లంతా.”