పెళ్లి చూపులు -17
ఆమె ఎందుకు భయపడుతుందో అర్థం కాని వైష్ణవ్ అయోమయంగా మహాలక్ష్మి వైపు చూశాడు.
“ఏం కాదులేదే, ఇది ఏమైనా నీకు కొత్త ఏంటి కాసేపు మీ అమ్మ చీపిరి కట్ట తిరగేస్తుంది అంతే కదా ఓర్చుకో.
అయ్యో అసలు విషయం చెప్పటం మర్చిపోయాను” అంటూ తన సంచిలో ఉన్న రెండు సైబాల్ డబ్బాలు తీసి మహాలక్ష్మి చేతిలో పెట్టింది కల్పన.
అవి ఎందుకో అర్ధమైన మహాలక్ష్మి కోపంగా కల్పనా వైపు చూసింది. కానీ అర్థం కాని వైష్ణవ్ మాత్రం ఇవి ఎందుకు అని అయోమయంగా అడిగాడు.
“ఎందుకు అనేది ఇంటికి వెళ్తావు కదా అక్కడ నీకు తెలుస్తుందిలే” అని అన్నది లలిత..